- 14-09-2009 :: 8 AM
- మార్కెట్ నాడి
గత వారం వరుస లాభాల తో 15 నెలల గరిష్ట స్థాయి లో ముగిసిన మన మార్కెట్లు నేడు ప్రతికూల ప్రపంచ మార్కెట్ల నడుమ ఈ వారం ట్రేడింగ్ ప్రారంభం చేయనున్నాయి. గత శుక్రవారాం అమెరికా మార్కెట్లు బలహీనమైన దిగుమతుల గణాంకాలు , లాభార్జన ( ప్రాఫిట్ బూకింగ్) మున్నగు కారణాల వలన లాభాల నుండి నష్టాల లో కి పయనించాయి. నేడు ఆసియా మార్కెట్లు కూడా అమెరికా మార్కెట్ల కి అనుసంధానం గా లాభార్జన దిశ గా పయనిస్తున్నాయి. మన మార్కెట్లు ప్రారంభ సమయానికి ఇదే ధోరణి ఆసియా మార్కెట్ల లో కొనసాగితే, నేడు మన మార్కెట్ల లో కొంత ప్రాఫిట్ బూకింగ్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇది జరిగిన పక్షం లో , నేడు ఆటో స్టాకు ల లో బలహీనత కనిపించే అవకాశం ఉంది.
ఐతే గత శుక్రవారం విడుదల అయిన IIP గణాంకాలు ఆశాజనకం గా ఉండటం వలన నేడు మన మార్కెట్లు , భారి గా పతనం అయ్యే ఆస్కారం తక్కువ. మధ్యాన్నం తరువాత , ఉదయం ట్రేడింగ్ లో ఏర్పడ్డ షార్ట్ ల ను కవెర్ చేసుకునే దిశ గా ట్రేడర్లు ప్రయత్నించే అవకాశం ఉన్నందున, ఐరోపా మార్కెట్లు స్థిరం గా ఉంటే, మార్కెట్లు కొంత పుంజుకునే అవకాశం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16264
- మద్దత్తులు: 16237-16124-16064-16002
- అవరోధాలు :16348-16452-16565