- మార్కెట్ ముందు చూపు
- (14-09-2009 నుండి 18-09-2009 )
సానుకూల ప్రపంచ వాతావరణం , ఋతుపవనాల పునరుద్ధరణ వంటి సెంటిమెంట్ బల పరిచే అంశాల నడుమ గత వారం 15 నెలల గరిష్ట స్థాయి లో మార్కెట్లు ముగిసాయి. మా అంచనాలకి అనుగుణం గా గత వారం సెన్సెక్స్ గరిష్టం గా 16, 435 చేరుకుంది. విదేశీ సంస్థాగత మదుపర్లు గత వారం భారి కొనుగోళ్ళ వలన మార్కెట్ లో బుల్ రన్ కొనసాగింది. ఈ సంవత్సరం విదేశీ సంస్థాగత మదుపర్లు ఇప్పటి వరకు 42, ౩౦౦ కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టటం విశేషం.
శుక్రవారం విడుదలైన పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు , ఈ వారం మార్కెట్ సెంటిమెంట్ ని బలోపేతం చేయనున్నది. ముఖ్యం గా మైనింగ్ రంగం పై ఈ గణాంకాలు సానుకూల ప్రభావం చూపనున్నది. కావున మైనింగ్ స్టాకులు ఈ వారం విశేషం గ లాభ పడే అవకాశం ఉంది. అదే విధం గా క్యాపిటల్ గూడ్స్ స్టాకు లు కొంత మేరకు క్షీణించే అవకాశం ఉంది.
ఈ వారం 15 వ తేది లోపల ముందస్తు ఆదాయపు పన్ను ని కంపనీలు దాఖలు చేయనున్నాయి. ఈ ఆదాయపు పన్ను నుంచి , కంపనీల ఆదాయం కొంత మేరకు అంచానా వేయవచ్చు. ఈ అంశం వలన , ఈ వారం స్టాకు ల వారిగా ట్రేడింగ్ ప్రాముఖ్యత సంతరించు కోనున్నది. గత వారం వరకు భారి వృద్ధి ని నమోదు చేసిన ఆటో రంగం లో బహుశా కొంత లాభార్జన చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఈ వారం ప్రత్యేకించి మార్కెట్లు ప్రభావితం చేసే దేశవాళి అంశాలు లేనందున, ప్రపంచ మార్కెట్ల కి అనుగుణం గా మన మార్కెట్లు ట్రేడ్ అయ్యే సూచనలు ఉన్నాయి.
టెక్నికల్ గా ఈ వారం మార్కెట్లు మరికొంత పుంజుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 16, 264 పాయింట్ల వద్ద నున్న సెన్సెక్స్ , ఈ వారం 16, 565 పాయింట్ల వరకు ఎగబాకే అవకాశం ఉంది. సెన్సెక్స్ నకు 16,348 - 16,452- 16,565-16,683- 16,754 పాయింట్లు ముఖ్య మైన అవరోధాలు. కాగా 16030 ~ 15950 పాయింట్ల మధ్య లో సెన్సెక్స్ నకు అతి కీలక మైన మద్దతు స్థాయి. ఆ తరువాత 15 , 568 పాయింట్లు వద్ద సెన్సెక్స్ నకు విశేషమైన మద్దత్తు స్థాయి అని చెప్పుకొనవచ్చు.