• 11-09-2009 ::
  • మార్కెట్ రిపోర్ట్

మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 47 పాయింట్లు పుంజుకుని 16, 264 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 4,830 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.29 శాతం, నిఫ్టీ 0.21 శాతం మేరకు వృద్ధి చెందాయి. నేటి ఉదయం 16, 255 పాయింట్ల వద్ద శుభారంభం చేసిన సెన్సెక్స్, మా అంచనాలకి అనుగుణం గా ఒడిదుడుకుల కు లోనయ్యింది. సెన్సెక్స్ ఆరంభ ట్రేడ్ లో గరిష్టం గా 16, 338 పాయింట్లకు చేరుకుంది. ఐతే , మా అంచనాలకి అనుగుణం గా మార్కెట్లు అటుపోట్లకి గురి అవుతూ ట్రేడ్ కాసాగాయి. ఒక దశ లో సెన్సెక్స్ కనిష్టం గా 16, 130 పాయింట్ల కి పడిపోయింది. ఐతే మధ్యాన్నం తదుపరి ఐరోపా మార్కెట్లు బలం గా ప్రారంభమవ్వటం, దేశ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు గత సంవత్సరం ఇదే సమయానికి 6.4 %కంటే మెరుగ్గా 6.8 % గా నమోదు కావటం తో మార్కెట్లు కొంత పుంజుకున్నాయి. చివరికి మార్కెట్లు స్వల్ప లాభం తో ముగిసాయి. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ రంగాలు గత రెండు రోజుల లాగే పేలవమైన ప్రదర్శ కనబరిచాయి. ఇవి 0.13 % , 0.38 % చొప్పున నష్టపోయాయి. నేడు కన్సుమేర్ డ్యుర బుల్ ఇండెక్స్ అత్యధికం గా వృద్ధి ని నమోదు చేయటం విశేషం. ఈ ఇండెక్స్ 1.79 శాతం వృద్ధి పొందగా, PSU , బ్యాంకింగ్ రంగాలు సుమారు 1.5 శాతం లాభపడ్డాయి. ఈ రోజు రియాలిటీ రంగం అత్యధికం గా 1.63శాతం నష్టపోగా, FMCG రంగం 1.18 శాతం నష్టపోయింది. సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , నేడు HINDALCO 6శాతం వృద్ధి పొందింది. కాగా ICICI బ్యాంకు 2.5 శాతం బలపడింది. కాగా , STERLITE , DLF 2.7 % , 2.5 %చొప్పున నష్టపోయాయి.