11-09-2009 :: 9 AM

మార్కెట్ నాడి

గత రాత్రి అమెరికా లో నిరుద్యోగ గణాంకాలు, ఎనర్జీ వాడుక గణాంకాలు ఆశాజనకం గా నమోదు అవ్వటం వలన , అక్కడి మార్కెట్లు భారి లాభాలను ఆర్జించాయి. . ఈ అంశం నేటి మన మార్కెట్ల లోని బుల్ల్స్ కి చేయూత నివ్వనున్నది. ఐతే నేడు ఆసియా మార్కెట్లు అన్ని కూడా తీవ్ర ఒడిదుడుకుల తో ట్రేడ్ అవుతున్నందున, ఈ ప్రభావం మన మార్కెట్ల పై తప్పక పడనున్నది. వారంతం కనుక నేడు మన మార్కెట్ల లో నిన్న కనిపించిన లాభార్జన ధోరణి మరింత ప్రస్పుటం గా కనిపించే అవకాశం ఉంది. పైగా దేశ ఎగుమతులు కూడా వరుసగా క్షీనిస్తున్నందున మన మార్కెట్లు నేడు ఆటుపోట్ల కి గురి అయ్యే అవకాశాలే ఎక్కువ గా ఉన్నాయి.

టెక్నికల్ గా చార్ట్లు బలహీనం గా ఉన్నాయి. కాని , నేడు కేవలం టెక్నికల్ చర్ల ప్రకారం ట్రేడ్ చేయలేని పరిస్థితి. ముఖ్యం గా , నేడు IIP గణాంకాల విడుదల మన మార్కెట్ల తదుపరి దిశ ని నిర్దేశించ నున్నది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16217
  • మద్దత్తులు: 16124-16064-16002
  • అవరోధాలు :16237-16348-16452