10-09-2009:: 6:40 pm
మార్కెట్ రిపోర్ట్
లాభార్జన కోసం క్రయవిక్రయాలు సాగినప్పటికీ.. స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 33 పాయింట్లు పుంజుకుని 16,217 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 5 పాయింట్లు లాభంతో 4,819 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.21 శాతం, నిఫ్టీ 0.11 శాతం మేరకు వృద్ధి చెందాయి.ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్ 123 పాయింట్ల లాభంతో 16,296 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వీచిన బలమైన సంకేతాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లో స్టాక్ మార్కెట్ గరిష్ఠంగా 16,435 వద్దకు చేరుకుంది.రియాల్టీ, ఆటో, చమురు మరియు సహజవాయువుల ఇండెక్స్‌లలో లాభార్జన కోసం జరిగిన లావాదేవీలతో.. బీఎస్ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ లాభాలను నిలబెట్టుకోలేకపోయింది. యూరోపిన్ మార్కెట్లలో బలహీన ప్రారంభం.. సెన్సెక్స్‌ను నష్టాల్లోకి నెట్టింది.. దీంతో స్టాక్ మార్కెట్ 16,166 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది.అయితే.. చివరి ట్రేడింగ్‌లో మేము ఉదయమే సూచించిన విధం గా బుల్ల్స్ దే పై చేయి అయ్యింది. దీంతో స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్ ముగిసింది. నేడు ,29 ఆగస్టుతో ముగిసిన వారాంతానికి విడుదల అయిన ద్రవ్యోల్బణ గణాంకాలు దాదాపు 0.12శాతం పెరిగింది. అదే గత వారం 0.21 శాతంకన్నా తక్కువగానే ఉండింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం ౦.17 % , స్మాల్ క్యాప్ రంగం ౦.77 % నష్టపోయాయి.
అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లలో.. రియాల్టీ ఇండెక్స 2.26 % , కన్సుమేర్ డ్యురబుల్స్ 1.58 శాతం క్షీణించాయి.మెటల్ మరియు బ్యాంకెక్స్.. 1 శాతం మేరకు లాభపడ్డాయి. సెన్సెక్స్ స్టాకు ల లో ICICI BANK , STERLITE 3.1 %, 2.5 % వృద్ధిని నమోదు చేయగా , DLF , HERO HONDA 2.8 %, 2.4 % చొప్పున నష్ట పోయాయి. AIRTEL - MTN మధ్య జరిగిన ఒప్పందం గురించి మీడియా లో వచ్చిన కథనాల లో వాస్తవం లేదని AIRTEL యాజమాన్యం చెప్పటం తో BHARTI AIRTEL నేడు 1.81 % లాభపడింది.