10-09-2009 :: 8 :30 AM

  • మార్కెట్ నాడి

నేడు చైనా మార్కెట్లు మినహా , ఆసియా మార్కెట్లు అన్ని కూడా గ్యాప్ అప్ తో శుభారంభం చేయటం మన మార్కెట్లకు శుభ సూచకం. గత రాత్రి అమెరికా లో ఫెడ్ విడుదల చేసిన BEIGE BOOK ప్రకారం అమెరికా లో గృహ కొనుగోళ్ళు ఇంకా కోలుకోలేదని ప్రకటించి నప్పటికీ , అక్కడి మార్కెట్లు ఈ వార్త ని ఖాతరు చేయకుండా భారి లాభాల తో ముగియటం , ప్రపంచ వ్యాప్తం గా సెంటిమెంట్ బలం గా ఉందన్న విషయానికి నిదర్శనం . ఈ కారణం గా మన మార్కెట్లు కూడా నేడు వృద్ధి బాట లో నడిచే అవకాశాలే ఎక్కువ గా ఉన్నాయి.

ఐతే మన మార్కెట్ల పరం గా యోచిస్తే , నేడు ద్రవ్యోల్బణ ఫలితాలు విడుదల కానున్నందున , ఈ ప్రభావం మన మార్కెట్ల పై పడే అవకాశం ఉంది. ఈ గణాంకాల ఫలితాలను బట్టి , నేడు బుల్ల్స్ జోరు కి స్వల్పం గా బ్రేక్ పడే అవకాశం లేక పోలేదు. ఐనప్పటికీ , నేడు మార్కెట్లు పెరిగే సూచనలే ఎక్కువగా ఉన్నాయి.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16184
  • మద్దత్తులు: 16124-16064-16002
  • అవరోధాలు :16237-16348-16452