• 09-09-2009:: 6 :10 pm
  • మార్కెట్ రిపోర్ట్

సెన్సెక్స్ పెద్ద బాబు రిలయన్స్ భారి గా లాభ పడటం తో నేడు కూడా మన మార్కెట్లు లాభాల తో ముగిసాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సూచించిన 60 పాయింట్లు బలపడి 16,184వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 9 పాయింట్లు వృద్ధి చెంది 4,814 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.37 శాతం, నిఫ్టీ 0.19 శాతం మేరకు వృద్ధి చెందాయి.

నేడు ఉదయం నుండి మార్కెట్ల లో భల్లుకాలకి ( bears) , నందులకి ( bulls ) నడుమ గట్టి పోటి నెలకొని ఉండటం తో మార్కెట్లు ఆటు పొట్ల కి గురి అయ్యాయి. ఒక దశ లో సెన్సెక్స్ గరిష్టం గా 16215 పాయింట్ల వరకు చేరుకుని , కనిష్టం గా 16045 పాయింట్ల వరకు పడిపోయింది. చివరకి రిలయన్స్ కౌంటర్ లో జరిగన కొనుగోళ్ళ సహాయం వలన అంతిమ విజయం బుల్ల్స్ కి దక్కింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.05 % నష్టపోగా , స్మాల్ క్యాప్ ఇండెక్స్ ౦.06 % లాభపడింది

రంగాల వారి గా పరిశీలిస్తే నేడు చమురు మరియు గ్యాస్ రంగం అత్యధికం గా 2.36% వృద్ధిని నమోదు చేసింది. కాగా బ్యాంకింగ్ రంగం 0.6% లాభ పడింది. నేడు రియాలిటీ రంగం అత్యధికం గా 1.65 % నష్టపోగా , టేక్ ఇండెక్స్ 1.09 % క్షీణించింది

ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , నేడు DLF , BHARTI AIRTEL 3.5 %, 3.4 % చొప్పున అత్యధికం గా నష్టపోగా, ముందుగా చర్చించినట్లు రిలయన్స్ అత్యధికం గా 4.5 % లాభాలను గడించింది. కాగా HINDALCO సైతం 4.1 % వృద్ధి పొందటం విశేషం .