• ౦౩-09-2009 :: 5:45 pm
  • మార్కెట్ రిపోర్ట్

బలహీనమైన సెన్సెక్స్ స్టాకు ల నడుమ నేడు వరుసగా నాలుగవ రోజు మన మార్కెట్లు నష్టపోయాయి. దీనితో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 69 పాయింట్లు కోల్పోయి 15,398 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 4,594 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.45శాతం, నిఫ్టీ 0.32 శాతం మేరకు క్షీణించాయి.

నేటి ట్రేడింగ్ లో దాదాపు చివరి వరకు లాభాలను నమోదు చేసిన సూచీలు, చివరి 15 నిమిషాల ట్రేడింగ్ లో బలహీనపడటం తో నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ సూమో వీరుడు రిలయన్స్ బలహీనపడటం తో మార్కెట్లు అమాంతం నష్టాలలో కూరుకు పోయింది. అంతకు ముందు, నేటి మధ్య్నాన్నం ఆగష్టు 22 కి సంబంధించిన ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల అయ్యాయి. ఈ సారి , స్వల్ప వృద్ధిని నమోదు చేస్తూ -0.21% గా రికార్డు అయ్యింది . గత వారం ఇది -0.95% గా ఉండింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం ౦.22 % , స్మాల్ క్యాప్ రంగం 0.71% లాభాలను నమోదు చేయటం విశేషం.

నేటి ట్రేడింగ్ లో కన్సుమేర్ డ్యురబుల్స్ ఇండెక్స్ అత్యధికం గా 0.75%, లోహం 0.59 % లాభాలను నమోదు చేసాయి. కాగా నేడు చమురు మరియు గ్యాస్ ఇండెక్స్ అత్యధికం గా 1.12% నష్టపోగా , హెల్త్ కేర్ 0.73% నష్టపోయి రెండవ స్థానం దక్కించుకుంది.

ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే నేడు RCOM 5.3% వృద్ధి తో అత్యధికం గా లాభం పడ్డ సెన్సెక్స్ స్టాకు గా నిలువగా,STERLITE 1.6% వృద్ధి సాధించి రెండవ స్థానం లో నిలిచింది. కాగా నేటి ట్రేడింగ్ లో RELIANCE , MNM చెరి 2 % చొప్పున నష్టాలను నమోదు చేసాయి.