04-09-2009 :: 9:25am

మార్కెట్ నాడి

మిశ్రమ మైన ఆసియా మార్కెట్ల నడుమ నేడు మరొక సారి మన మార్కెట్లు , ఈ వారం లో చివరి సారిగా ట్రేడ్ కానున్నాయి.

నిన్న ట్రేడింగ్ ముగింపు లో సెన్సెక్స్ స్టాకు లు బలహీన పడటం తో నేడు మన మార్కెట్ల లో భల్లూకాలకు ( bears )తమ ప్రతాపం మరొక సారి ప్రదర్శించ నున్నాయి. ఐతే చమురు ఉత్పత్తుల పై సంస్కరణ ల పై కేంద్రం కమిటి త్వరలో సిఫారీసులు చేయనున్నది. దీనిని పురస్కరించుకొని మార్కెట్ల లో బుల్ల్స్ తిరిగి తమ పట్టు సాధించుకునే ప్రయత్నం చేయవచ్చు.

నేడు వారాంతం కనుక నేడు మార్కెట్ల లో నిర్దుష్టమైన దిశ కనపడక పోవచ్చు. ఈ వారం లో ఇప్పటివరకు కనిపించిన ఆటుపోట్లు , నేడు కూడా మార్కెట్ల లో కనిపించే అవకాశం ఉంది. చివరి అర గంట ట్రేడింగ్ లో కొంత షార్ట్ కవెరింగ్ కనిపించే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15398
  • అవరోధాలు:15446- 15568-15695-15769
  • మద్దత్తులు ::15370-15169-15080