03-09-2009::8:30 am
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్లు తీవ్ర మైన ఆటుపోట్లకి గురి అవుతూ స్వల్ప నష్టాలలో ముగిసింది. అమెరికా లో నిరుద్యోగ గణాంకాలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయని అంచనాల తో అమెరికా మార్కెట్లు అతలాకుతలం అయినాయి. ఈ సారి సుమారు 2, 33 ,000 ఉద్యోగాలకు ఎసరు కలగనున్నదని ప్రాధమిక అంచనాలు. ఈ కారణం గ ప్రపంచ మార్కెట్ల లో ఇంకా ఉత్సాహం చోటు చేసుకోలేదు. నేడు ఆసియా మార్కెట్లు సైతం మిశ్రమంగా పయనిస్తున్నాయి.
మన మార్కెట్లను పరిశీలిస్తే, గత మూడు రోజులు గా నష్టాలను చవిచూస్తున్న మన మార్కెట్లు నేడు కొంత లాభాల దిశ లో పయనించే ప్రయత్నం చేయనున్నాయి. టెక్నికల్ గా నిన్న సెన్సెక్స్ నకు 15 DMA వద్ద మద్దత్తు లభించటం తో నేడు మన మార్కెట్ల లో బుల్ల్స్ రంగ ప్రవేశం చేసేందుకు కృషి చేయనున్నాయి. పైగా మూడు రోజుల వరుస నష్టాల తరువాత మార్కెట్ల లో కొంత పుల్ బ్యాక్ ర్యాలీ కి కూడా ఆస్కారం ఉంది.
ఐతే నేడు ఆగష్టు 22 కి చెందిన ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా విడుదల కానున్నది. ఈ అంశం కూడా మార్కెట్లను మధ్యాన్నం తరువాత ప్రభావితం చేసే అంశం.
ప్రపంచ మార్కెట్లను అనుసరించి మన మార్కెట్లు , నేడు కూడా, మరొక సారి ఆటు పొట్ల కి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు : గత ముగింపు: 15467 అవరోధాలు: 15568-15695-15769-15814 మద్దత్తులు ::15446-15370-15169-15080