- 09-09-2009 :: 8:00 AM
- మార్కెట్ నాడి
అతి కీలక 16 వేల పాయింట్ల అవరోధాన్ని చేదించిన సెన్సెక్స్ , ఒక ముఖ్యమైన మైలు రాయి దాటిందని చెప్పాలి. గత కొన్ని వారాలు గా CONSOLIDATE అయిన మార్కెట్లు , మునుముందు మరింత పుంజుకునే శక్తి ని ఆపాదించుకున్నది. ఈ ఉత్సాహం తో మార్కెట్ల లో రానున్న కొన్ని రోజులలో బుల్ల్స్ హవా కొనసాగానున్నది.
ప్రపంచ మార్కెట్లు కూడా సహకరించటం మన మార్కెట్లకి మరింత చేయూత నివ్వనున్నది.
స్టాకు ల పట్ల విదేశీ సంస్థాగత మదుపర్ల కు మరింత ఆసక్తి కలుగుతున్నందున , అమెరికా డాలర్ మరింత క్షీణించే అవకాశం ఉంది. దీని వలన మన ఐ.టి స్టాకు లు ప్రభావితం అయ్యే సూచనలు ఉన్నాయి. డాలర్ మరింత క్షీణించే అవకాశం ఉన్నందున అంతర్జాతియ మార్కెట్ల లో కామోడిటి ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ ప్రభావం ఇప్పటికే బంగారం ధరల పై కనిపిస్తున్నందున, మదుపర్లు సుమారు రెండు నెలల వ్యవధికి గాను GOLD ETF ల లో కూడా పెట్టుబడి పెట్టె ఆలోచనలు చేయవచ్చు.
-
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
-
గత ముగింపు: 16124
-
మద్దత్తులు: 16064-16002-15814
-
అవరోధాలు :16237-16348-16452
-