08-09-2009 :: 6 :30 PM
- మార్కెట్ రిపోర్ట్
గరిష్ట స్థాయి నుండి మార్కెట్లు కోల్పోయినప్పటికి , నేడు మార్కెట్లు లాభాల తో ముగిసాయి. దీనితో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సూచించిన 107 పాయింట్లు బలపడి 16,124వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 22 పాయింట్లు వృద్ధి చెంది 4,805 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.67 శాతం, నిఫ్టీ 0.47 శాతం మేరకు వృద్ధి చెందాయి.అంతకుముందు.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వీచిన బలమైన సంకేతాల ప్రభావాన ఈ రోజు ఉదయం లాభాల ప్రక్రియలో సెన్సెక్స్ 216 పాయింట్లు లాభపడి గరిష్ఠంగా 16,232 వద్దకు చేరుకుంది.ఇది మేము ఉదయం సూచించిన 16, 237 పాయింట్ల అవరోదానికి సరిపోయిందని గమనించాలి. ఐతే , లాభాల స్వీకరణ తో మార్కెట్లు కొంత కోల్పోయి 16, 124 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది కూడా మేము ఉదయం సూచించిన 16,127 పాయింట్ల స్థాయికి అత్యంత సమీపం అని గుర్తించాలి. గత వారం రోజులు గా భారి గా వృద్ధి చెందుతున్న మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ రంగాలు నేటి ట్రేడింగ్ లోనష్టాలు చవి చూసాయి . మిడ్ క్యాప్ రంగం 0.42 % , స్మాల్ క్యాప్ రంగం 0.15% మేరకు క్షీణించాయి.
నేడు మెటల్స్ ఇండెక్స్ 2.51 %, చమురు మరియు గ్యాస్ ఇండెక్స్ 2.01 % వృద్ధి చెందటం విశేషం. కాగా FMCG రంగం అత్యధికం గా 1.15 % క్షీనించ గా, ఆటో ఇండెక్స్ 1 % నష్టపోయింది. ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , నేడు HINDALCO 6 %, STERLITE 4.8 % లాభపడగా TATA POWER, HUL 3.1%, 2.7 % చొప్పున నష్టపోయాయి.