- 08-09-2009 :: 8:45 am
- మార్కెట్ నాడి
15 నెలల గరిష్ట స్థాయి లో నిన్న ముగిసిన మన మార్కెట్లు, నేడు కూడా ఇదే విజయోత్సాహం కనపరిచే అవకాశం ఉంది. గత రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలను ఆర్జించటం , నేటి ఉదయం ఆసియా మార్కెట్లు కూడా దాదాపు లాభాల బాట లో నే నడవటం , మన మార్కెట్ల లో ని బుల్ల్స్ కి మరింత చేయూత నివ్వనున్నది.
ఉద్దేపన ప్యాకేజీలు కనసాగానున్నట్లు ఆర్ధిక మంత్రి చేసిన ప్రకటన, ఋతుపవనాలు పునరుద్ధరణ వంటి అంశాలు కూడా మార్కెట్ల సెంటిమెంట్ కి బలం చేకూర్చనున్నాయి. ఐతే ఆర్ధిక మంత్రి , ఈ ఆర్ధిక సంవత్సరానికి రాబోయే రోజులలో GDP వృద్ధి తగ్గే అవకాశాలు ఉన్నాయని ప్రకటించటం మార్కెట్ల లో ని BEARS ( భల్లూకాలు ) కి కొంత ఉత్సాహం కలిగించే అంశం.
టెక్నికల్ గా పరిశీలిస్తే, నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్, 16 వేల మార్కు ని నిర్వివాదం గా చేదించటం అతి కీలకం . నేడు 16002 పాయింట్ల మద్దత్తు స్థాయి నిలబడితే , మార్కెట్లు మరింత గా పుంజుకునే అవకాశం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16016
- మద్దత్తులు: 16002-15814-15769-15695
- అవరోధాలు :16064-16127-16237-16348