• 07-09-2009 :: 6 : 25 PM
  • మార్కెట్ రిపోర్ట్
సానుకూలమైన ప్రపంచ మార్కెట్ల మధ్య నేడు మన మార్కట్లు ఈ వారం శుభారంభం చేసాయి. ఆద్యంతం లాభాల బాట లో కొనసాగుతూ నేడు సెన్సెక్స్ 327 పాయింట్లు లాభపడి 16016 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 103 పాయింట్లు వృద్ధి చెంది 4783 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 2.09 శాతం లాభ పడగా , నిఫ్టీ 2.19 శాతం లాభ పడింది. 15 నెలల గరిష్ట స్థాయి లో మార్కెట్లు ముగియటం నేటి ట్రేడింగ్ విశేషం. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 2.31 శాతం , స్మాల్ క్యాప్ రంగం 2.83 శాతం వృద్ధి చెందాయి. నేడు FMCG రంగం మినహా అన్ని రంగాలు లాభాల బాట లో నడిచాయి. నేటి ట్రేడింగ్ లో రియాలిటీ ఇండెక్స్ అత్యధికం గా 5.49 శాతం వృద్ధి చెందటం విశేషం. కాగా మెటల్స్ ఇండెక్స్ 3.95 % లాభాలను ఆర్జించింది. కన్సుమేర్ డ్యురబుల్స్ 3.59 శాతం లాభ పడింది. FMCG ఇండెక్స్ ౦.08% స్వల్ప నష్టాన్ని నమోదు చేసింది. ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే నేటి ట్రేడింగ్ లో TATA MOTORS 11.3 %, RCOM 6.6 % వృద్ధిని నమోదు చేసాయి. కాగా ITC, MNM 0.9 %, 0.5 % చొప్పున నష్టాలను నమోదు చేసాయి.