04-09-2009 ::4:40 pm
- మార్కెట్ రిపోర్ట్
నాలుగు రోజుల నష్టాల తరువాత నేడు కొనుగోళ్ళ సహాయం తో మార్కెట్లు లాభ పడ్డాయి. దీనితో దీనితో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 291 పాయింట్లు కో వృద్ధి చెంది 15,689 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 4680 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ,నిఫ్టీ 1.89 శాతం మేరకు లాభపడ్డాయి. నేటి ఉదయం మేము సూచించిన 15695 పాయింట్ల కీలక అవరోధం కి అతిసమీపం గా 15, 689 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగియటం , మార్కెట్ ముగింపు సమయానికి మా అంచనాలకి అనుగుణం గా షార్ట్ కవెరింగ్ చోటు చేసుకోవటం నేటి ట్రేడింగ్ విశేషాలు .
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.08 %, స్మాల్ క్యాప్ రంగం 1.07 % లాభ పడ్డాయి. నేడు అన్ని రంగాలు లాభ పడటం విశేషం .నేటి ట్రేడింగ్ లో ఆటో ఇండెక్స్ రివ్వున దూసుకెళ్లింది. ఆటో ఇండెక్స్ 2.88 % వృద్ధిని నమోదు చేయగా, మెటల్స్ ఇండెక్స్ 2.76% వృద్ధిని నమోదు చేసింది.
ఇక సెన్సెస్ స్టాకు లను పరిశీలిస్తే MNM 6.21 % M HERO HONDA 4.20 % అత్యధికం గా లాభాలను ఆర్జించాయి. కాగా టాటా మోటార్స్ స్వల్పం గా 0.31 % క్షీణించింది.