• 02-09-2009:: 5:40 PM
  • మార్కెట్ రిపోర్ట్
బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నేపథ్యం లో నేడు మన మార్కెట్లు మరొక సారి నష్టాలను చవి చూసాయి. దీనితో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 84 పాయింట్లు కోల్పోయి 15,467 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయి 4,608 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.54 శాతం, నిఫ్టీ 0.37 శాతం మేరకు క్షీణించాయి. నేటి ఉదయం మేము సూచించిన 15463 పాయింట్ల కీలక మద్దత్తు కి అతిసమీపం గా 15, 467 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగియటం నేటి ట్రేడింగ్ విశేషం గా చెప్పుకోదగ్గ అంశం . మోర్గాన్ స్టాన్లీ భారత దేశపు GDP ని 5.8% గా ఉండే అవకాశాం ఉందని , GDP అంచనాలను కుదించటం నేడు మార్కెట్ల బలహీనతకి మరింత కారణ హేతువైయింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.68 % నష్టపోగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.32 % క్షీణించింది .నేడు
ఐ. టి, టేక్ ఇండెక్స్ 0.98 %, 0.52 % చొప్పున లాభాలను ఆర్జించటం విశేషం. కాగా నేటి నష్టాల్లో రియాల్టీ ఇండెక్స్ ప్రధాన భూమికను పోషించింది. దాదాపు 1.76 శాతం మేరకు రియాల్టీ క్షీణించింది. నిన్న లాభాల బాట లో నడిచిన ఆటో ఇండెక్స్ నేడు 1.36 % నష్టపోయింది.
ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే నేటి ట్రేడింగ్ లో RCOM 4.56 %, HUL 2.01 % చొప్పున లాభపడ్డాయి. నేడు STERLITE 3.16 %, BHEL 2.65 % నష్టపోయి అత్యధికం గా నష్టపోయిన సెన్సెక్స్ స్టాకు లు గా నిలిచాయి.