- 02-09-2009 :: 9 am
- మార్కెట్ నాడి
స్పెకులేషన్ కారణం గా నిన్న కోల్పోయిన మన మార్కెట్లు, నేడు తమ తదుపరి గమనం కొరకు ఆసియా మార్కెట్ల గమనం పై ఆధారపడనున్నది. నేడు ఆసియా మార్కెట్లన్నీ కూడా తీవ్ర ఒడిదుడుకులతో పయనిస్తున్నాయి. గత రాత్రి అమెరికా మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలు ఎదుర్కోవటం తో , నిన్న అమెరికా మార్కెట్ల లో నష్టాలు చవిచూసిన ఫైనాన్షియల్ మరియు కోమోడిటి స్టాకులు నేడు ఆసియా మార్కెట్ల లో కూడా నష్టపోతున్నాయి. ఈ ప్రపంచ మార్కెట్ల ధోరణి వలన నేడు మన మార్కెట్ల లో ఈ స్టాకులు బలహీనం గా ఉండే అవకాశం ఉంది.
వరుసగా 10 వ నెల కూడా మన ఎగుమతులు దెబ్బతినటము, ఈ ఆర్ధిక సంవత్సరం లో రాబోయే మూడు త్రైమాసికా ల లో కూడా GDP వృద్ధి రేటు 6.1 % కి మించి ఉండే అవకాశం లేదని ప్రణాళిక సంఘం ప్రకటించటం వంటి అంశాలు మన మార్కెట్ల సెంటిమెంట్ ని కొంత బలహీన పరిచే విధం గా ఉంది.
ఈ కారణాల వలన మన మార్కెట్ల లో కొంత బలహీనత కనిపించే అవకాశం ఉంది. మధ్యాన్నం తదుపరి, ఐరోపా మార్కెట్ల ప్రభావం వలన కొంత ఊరట పొందే అవకాశం ఉంది. నేడు మార్కెట్లు ఆటుపోట్లకి గురిఅవుతూ ట్రేడ్ అయ్యే సూచనలే అధికం గా ఉన్నాయి.
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు
- గత ముగింపు: 15551
- అవరోధాలు : 15567-15769-15814
- మద్దత్తులు: 15463-15370-15169-15080