- 01-09-2009: : 6:30 PM
మార్కెట్ రిపోర్ట్
వరుసగా రెండవ రోజు స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 115 పాయింట్లు కోల్పోయి 15,551 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 4,625 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.74 శాతం, నిఫ్టీ 0.79 శాతం మేరకు క్షీణించాయి.అంతకుముందు.. నిన్న నష్టాలతో ముగిసిన అనంతరం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వీచిన బలమైన సంకేతాల ప్రభావంతో ఈ రోజు ఉదయం 24 పాయింట్లు పుంజుకుని 15,691 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ఈ రోజు ప్రథమార్ధంలో ఇండెక్స్ భారీగా లాభపడింది.ఆసియా మార్కెట్లు మరియు పుంజుకున్న కార్ల విక్రయాలు తదితర అంశాలు ఉదయపు ట్రేడ్లలో ఇండెక్స్‌పై ప్రభావం చూపాయి. దేశంలో ఆటో దిగ్గజం మారుతీ కంపెనీ 42 శాతం మేరకు విక్రయాలు పెరిగినట్లు ప్రకటించింది. దీంతో సెన్సెక్స్ లాభాల ప్రక్రియలో 15,923 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది.అయితే మధ్యాహ్నపు ట్రేడ్‌లో అనూహ్యంగా.. రియాల్టీ, మెటల్, విద్యుత్ స్టాకుల్లో విక్రయాలు భారీగా జరిగాయి. దీంతో ఇండెక్స్ కుప్పకూలింది. ఇక ద్వితీయార్థమంతా నష్టాల్లోనే పయనించింది. ఈ నష్టాల ప్రక్రియలో సెన్సెక్స్ 15,475 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది.చివరికి 15,551 వద్ద స్టాక్ మార్కెట్ ముగిసింది. ఆటో, ఐ. టి, టేక్ ఇండెక్స్ మినహా అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. ఈ నష్టాల్లో రియాల్టీ ఇండెక్స్ ప్రధాన భూమికను పోషించింది. దాదాపు 3 శాతం మేరకు రియాల్టీ క్షీణించింది. మెటల్, విద్యుత్, పెట్టుబడి ఉత్పత్తులు మరియు హెల్త్‌కేర్ ఇండెక్స్‌లు 1 నుంచి 2 శాతం చొప్పున బలహీనపడ్డాయి.ఆటో ఇండెక్స్ అత్యధికం గా 2.45 % వృద్ధిని నమోదు చేయటం విశేషం.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు సుమారు 1.45 %, 1.51 % చొప్పున నష్టపోయాయి. నేటి సెన్సెక్స్ స్టాకు ల లో MARUTI , TATA MOTORS 7.6%, 5.8 % లాభ పడగా, ACC , STERLITE 3.6%, 2.9 % చొప్పున క్షీణించాయి.