01-09-2009:8:15AM

  • మార్కెట్ నాడి

నేడు ప్రధాన మంత్రి , ప్రణాళిక సంఘం తో భేటి చేయనున్నారు. రాబోయే ఐదు సంవత్సరాలకి గాను GDP వృద్ధి రేటు ని , గతం లో నిర్ణయించిన 9 శాతం ని పునరాలోచన చేయనున్నారు. ప్రణాళిక సంఘం బహుశా ఈ గణాంకాలను 7.8 శాతం వరకు కుదించ వచ్చని అంచనా. ఈ సందర్భం గా ప్రధాని చేయబోయే ప్రకటన మన మార్కెట్ల తీరు తెన్నులను నిర్దేశించనున్నాయి .

అదే విధం గా , నేడు NHPC లిస్టింగ్ జరగనునున్నది. ఈ అంశం కూడా మార్కెట్ టర్న్ ఓవర్ పై ప్రభావం చూపించ నున్నది.

ఇక ప్రపంచ మార్కేట్లని పరిశీలిస్తే, చైనా మార్కెట్లు తాత్కాలిక BEAR మార్కెట్ లో కి ప్రవేశించటం వలన , మెటల్స్ , కామోడిటి సంబంధించిన స్టాకులు మరికొంత కాలం ఆటుపోట్లకి లోనయ్యే అవకాశం ఉంది. ఐతే రానున్న రోజులలో విదేశీ మదుపర్లు, చైనా బదులు భారత దేశం లో పెట్టుబడులు పెట్టె ఆస్కారం ఉంది. తద్వారా మన మార్కెట్లకు కొంత లాభం కలిగే అవకాశం కూడా ఉంది.

నిన్న భారి గా నష్టపోయిన ఆసియా మార్కెట్ల లో నేడు పుల్ బ్యాక్ ర్యాలీ కన వస్తోంది. మన మార్కెట్ల లో సైతం ఇటువంటి ర్యాలీ వచ్చే సూచనలు ఉన్నాయి.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15667
  • అవరోధాలు : 15769-15814-15995
  • మద్దత్తులు: 15567-15370-15169