- 31-08-2009:: 5:40 PM
మార్కెట్ రిపోర్ట్
నేడు మార్కెట్లకు మరొకసారి డ్రాగన్ షాక్ తగిలింది.. దీనితో సెన్సెక్స్ 256 పాయింట్లు కోల్పోయి 15667 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 4,662 వద్ద ముగిసింది. నేడు సెన్సెక్స్ మా అంచనా లకు అనుగుణం గా , బలహీన మైన ఆసియా మార్కెట్ల నడుమ 15812 పాయింట్ వద్ద ప్రారంభమయ్యింది. చైనా మార్కెట్లు ఘోరం గా విఫలం కావటం వలన మన మార్కెట్ల సెంటిమెంట్ కూడా ఆద్యంతం బలహీనం గా ఉండటం తో , నష్టాల బాట పట్టాయి. ఒక దశ లో సెన్సెక్స్ కనిష్టం గా 15590 పాయింట్ల వరకు పడిపోయింది.
నేడు జూన్ తో ముగిసిన త్రైమాసిక GDP వృద్ధి రేటు 6. 18 % గా నమోదయ్యింది. ఇది సుమారు 6.2 % ఉండవచ్చని ఉదయమే మేము తెలియచేసాము . గత సంవత్సరం ఇదే సమయానికి ఇది 7.8% గా ఉండింది. . దీనికి తోడు లాభార్జన కోసం విక్రయాలు జరగడంతో సెన్సెక్స్ మరింతగా క్షీణించింది.
రియాల్టి , మెటల్ (లోహం) రంగాల స్టాకుల్లో భారీ విక్రయాలు జరిగాయి. దీంతో రెండో రోజు వరుసగా సెన్సెక్స్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 1.77 శాతం, నిఫ్టీ 2.40 శాతం మేరకు క్షీణించాయి. బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్2.91 శాతం, ఆటో ఇండెక్స్ 1.09 % వృద్ధిని నమోదు చేసింది. నేడు ఐ. టి ఇండెక్స్ 2.26 %,లోహం 2.18 % అత్యధికం గా నష్టాలను చవిచూసాయి.
నేడు స్మాల్ క్యాప్ రంగం 0.51 % , మిడ్ క్యాప్ 0.33 % లాభపడటం విశేషం
ఇక స్టాకు ల వారిగా పరిశీలిస్తే సెన్సెక్స్ స్టాకు ల లో TATA STEEL 3.3 %, RELIANCE 3.2 % నష్టపోయాయి. కాగా MNM 4.2 %, DLF 2.7 % అత్యదికంగా లాభ పడ్డ సెన్సెక్స్ స్టాకులు గా నిలిచాయి.