- 14-08-2009 :: 6:42 PM
- మార్కెట్ రిపోర్ట్
స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 107 పాయింట్లు కోల్పోయి 15,412 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 4,580 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.69 శాతం, నిఫ్టీ 0.54 శాతం మేరకు క్షీణించాయి.నిన్న భారీ లభాలతో ముగిసిన తర్వాత ఈ రోజు ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వీచిన బలమైన సంకేతాల ప్రభావంతో 12 పాయింట్ల లాభంతో15,530 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లోనే సెన్సెక్స్ కొంత మేరకు లాభపడింది.మా అంచనాలకి అనుగుణం గా, అతి కీలక మైన 15568 పాయింట్ల అవరోధాన్ని చెదించ లేక పోవటం తో , ఆ లాభాలు ఎంతో సేపు నిలబడలేదు.అంతర్జాతయ మార్కెట్ల బలమైన సంకేతాలు సైతం మన మార్కెట్‌పై ప్రభావం చూపలేకపోయాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్ కూడా సాయంత్రం వరకు ఒడిదుడుకుల మధ్య పయనించింది. దీంతో సెన్సెక్స్ ఒకానొక దశలో 15,368 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది.మా అంచనాల కి అనుగుణం గా , ప్రాఫిట్ బూకింగ్ కారణం గా నేడు మార్కెట్లు క్షీణించాయి. చివరికి సెన్సెక్స్ 107 పాయింట్ల నష్టంతో ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో బీఎస్ఈ చమురు మరియు సహజవాయువుల ఇండెక్స్ 1.73 శాతం, బీఎస్ఈ కన్సుమేర్ డ్యురబుల్స్ ఇండెక్స్ 1.2 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా రియాలిటీ రంగం 1.69 % అత్యధికం గా నష్ట పోగా, FMCG ఇండెక్స్ 1.26 % నష్టపోయి రియాలిటీ ఇండెక్స్ కి తోడుగా నిలిచింది.
ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే నేడు ONGC అత్యధికం గా 4.79 % లాభంఆర్జించింది. కాగా JAI PRAKASH ASSOCIATES అత్యధికం గా 3.52 % నష్టపోయింది.