• 14-08-2009:: 8am .

  • మార్కెట్ నాడి
ఈక్విటీ ట్రేడింగ్ పై పన్ను రద్దు, ప్రత్యక్ష పన్నుల తగ్గింపు మున్నగు ప్రతిపాదనల కు ప్రత్యక్ష పన్నుల ముసాయిదా లో చోటు కల్పించటం తో నిన్న స్టాక్ మార్కెట్లు ఉరకలు వేసాయి. ఈ అంశం తో మార్కెట్ సెంటిమెంట్ కొంత బలపెడెందుకు సహకరించింది. గత రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల తో ముగియటం, నేడు కూడా ఆసియా మార్కెట్లు జోరుగా లాభాలను ఆర్జిస్థూ ఉండటం వంటి అంశాలు నేడు మన మార్కెట్లను మరింత ముందుకు తీసుకు వెళ్ళే ప్రయత్నం చేయనున్నాయి.
ఐతే దేశం లో కరువు పరిస్థితి గురించి వాతావరణ శాఖ ప్రకటనలు దిగులు పుట్టించే విధం గా ఉన్నాయి. ఆగష్టు నెల లో కూడా వర్ష పాతం సుమారు 10 నుండి 15 శాతం వరకు క్షీనించ నున్నాయని తెలియచేసింది. అదే విధం గా భూగర్భ జలాల నివేదిక కూడా , దేశం లో , ముఖ్యం గా వాయవ్య ప్రాంతాల లో భూగర్భ జలాల పరిస్థితి ప్రమాద ఘంటికలను మ్రోగిస్తున్నాయని , సాటిలైట్ ఇమేజుల ప్రకారం పరిస్థితి విషమించిందని నివేదిక పేర్కొంది. స్వయిన్ ఫ్లూ అంశం కూడా మార్కేట్లని బెంబేలు పుట్టిస్తున్నది. ఈ విషయాలు bears కి ప్రధాన ఆయుధాలు గా మారనుంది. పైగా నేడు వారాంతం కనుక, ట్రేడేర్లు తమ పెట్టుపడులను సొమ్ము చేసుకునే అవకాశాలు ఉన్నాయి. గత రెండు రోజుల సెన్సెక్స్ భారి వృద్ధి కూడా లాభార్జనకు తావు ఇవ్వనున్నది. కాబట్టి మధ్యాన్నం వరకు మార్కెట్లు పెరిగినా, ఆ తరువాత కొంత ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకునే అవకాశం లేక పోలేదు.
టెక్నికల్ గా పరిశీలిస్తే సరిఇగా గత గురవారం కూడా సెన్సెక్స్ సరిగ్గా 15514 పాయింట్ల కు ముగియటం గమనించ వలసిన అంశం . నేటి ట్రేడింగ్ లో 15568 అత్యంత కీలక అవరోధం. గ్యాప్ అప్ తో మార్కెట్లు ప్రారంభ మయి , ఈ అవరోధాన్ని చెదించ గలిగితే మార్కెట్లు మరింత లాభా పడే అవకాశాలు ఉన్నాయి. కాని మధ్యాన్నం తరువాత మాత్రం ట్రేడర్లు సెన్సెక్స్ దిశని నిర్దేశించ నున్నారు.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15518
  • అవరోధాలు : 15568-15769-15814- 15995
  • మద్దత్తులు: 15446-15370-15160-15080