మార్కెట్ ముందు చూపు
(17-08-2009 ~ 21-08-2009 )
గత వారం సెన్సెక్స్ 15545 ~ 14701 మధ్య లో ట్రేడ్ అయ్యింది. మేము గత వారం మార్కెట్ ముందు చూపు లో 14530 , 15568 పాయింట్లు అతి కీలకమని సూచించాము. మేము సూచించిన రీతి లోనే మార్కెట్లు మరొక సారి నడుచుకున్నాయి. గడిచిన వారం ప్రతీ ముగింపు కూడా 15 వేల పాయింట్ల కంటే ఎగువ గా మార్కెట్లు ముగియటం విశేషం.
స్వతంత్ర దినోత్సవ సందర్భం గా ప్రధాని మన్మోహన్ సింగ్ దేశం లో నెలకొని ఉన్న పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేయటం మార్కెట్ల లో బుల్ల్స్ జోరు కి స్వల్ప బ్రేక్ వేసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఈ సంవత్సరం ఇప్పటివరకు వర్షపాతం లో 56 % క్షీణత ఉందని ప్రకటించటం, దేశం కరువు కోరల్లో చిక్కుకొబొతున్నదని హెచ్చరిక గా మనం భావించాలి. దీని ప్రభావం వలనA GDP 1 ~ 1.5 % వరకు తగ్గే అవకాశం ఉందని ఆంచనా.
ఈ వారం ప్రత్యక్ష పన్నుల కోడ్ గురించి మరిన్ని విషయాలు మన ముందుకు రానున్నాయి. వివాదాస్పదమైన ఎస్టిటి పన్నును ఎత్తివేయాలనే సిఫార్సులను కూడా ఈ డైరెక్ట్ టాక్స్ కోడ్లో పొందుపరిచారు. దీంతో పాటు దీర్ఘకాల మూలధన లాభాలపై పన్నును పునరుద్ధరించాలని కూడా సూచించారు..అంటే ఈ కోడ్ ప్రకారం STT రద్దు చేసి , కుడి చేత్తో ఇచ్చి, మూల ధనం పై లాభాం పై పన్ను విధించి ఎడం చేత్తో తీసుకున్నట్లు అవుతుంది. ఈ పన్ను విధానం అమలు పరిచే లోపల , ఈ కొత్త పన్ను నుండి ఈ సారికి మాత్రం తప్పించుకునేందుకు , మదుపర్లకు ఒక మార్గం ఉంది. గతం లో అతి తక్కువ ధరకి షేర్లు కొన్న దీర్ఘ కాలిక మదుపర్లు , ఈ పన్ను విధానం అమలు పరిచే లోపల , ఎక్కువధరకి అమ్మి, మరునాడు అవే షేర్లు కొనుగోళ్ళు చేసుకున్నట్లయితే , వాటి పై పన్ను లెక్కింపు లో ఈ కొత్త గా కొన్న ధర ని పరిగణ లోకి తీసుకోవటం జరుగుతుంది కాబట్టి కొంత మేరకు ఈ పన్ను ని తప్పించు కునే అవకాశం ఉంది. ఈ సూత్రం మ్యూచువల్ ఫండ్స్ కి కూడా వర్తిస్తుంది. దీని ప్రభావం వలన మార్కెట్ల లో స్వల్ప కాల బలహీనత కనిపించి, అమ్మకాల వత్తిడి తీవ్రం గా ఉంటుంది. మరల కొనుగోళ్ళు చేసే సమయం లో కూడా మార్కెట్ల లో కొనుగోళ్ళు భారి గా ఉంటాయి. అంటే మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రం గా ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, తారా స్థాయి లో అమ్మకాలు భారి గా జరగనున్నాయి.
ఐతే కరువు ,స్వయిన్ ఫ్లూ మున్నగు అంశాలు మార్కేట్లని దిగులు కలిగిస్తున్న తరుణం లో మార్కెట్లు ఇంకా పైకి ఎగబాకే అవకాశం స్వల్పమే కాబట్టి మూల ధన లాభాల పై పన్ను అంశం ని పరిశీలిస్తే, దీర్ఘ కాలిక మదుపర్లు, మ్యూచువల్ ఫండ్ మనేజేర్లు ప్రస్తుతం ఉన్న స్థాయి లో అమ్మివేయాలని ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈ అంశం స్వల్పకాలానికి మార్కెట్లను బలహీన పరిచే విధం గా ఉంది. ఒక వేళ మార్కెట్లు భారి గా పతనమైనా, అదే రీతిన మరల పుంజుకునే అవకాశం కూడా ఉంది.
ప్రస్తుతం మన మార్కెట్లు ప్రపంచ మార్కెట్లకి అనుసంధానం గా పయనిస్తోంది. ప్రపంచ మార్కెట్ల లో దిద్దు బాటు జరిగితే , వెనువెంట నే మన మార్కెట్లు కూడా దిద్దుబాటు కి గురి అయ్యే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్లు లాభాల లో పయనిస్తున్నంత కాలం మన మార్కెట్లు కూడా ఉత్సాహాం గానే ఉండనున్నాయి.
టెక్నికల్ గా పరిశీలిస్తే మన మార్కెట్లు గత రెండు నెలలు 14000~ 15500 పాయింట్ల మధ్య CONSOLIDATE అవుతున్నాయి. ఈ వారం మరొక సారి 15568 .అవరోధం సెన్సెక్స్ నకు కీలకం . FIBINOCCI సూత్రం ప్రకారం మార్కెట్లు స్వల్పకాలదిద్దుబాటు కు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 13260 స్థాయికి దిద్దుబాటు జరగవచ్చు. కాగా ఈ వారం ప్రారంభం లో మార్కెట్లు కొంత దిద్దుబాటు కి గురి అయ్యే అవకాశం ఉంది . 14780 పాయింట్ల మద్దత్తు కోల్పోతే ఈ దిద్దిబాటు చోటు చేసుకునే అవకాశం మరింత గా ఉంది. ఈ వారం సెన్సెక్స్ నకు 15370-15169-15080-14930- 14780 -14530 మద్దత్తు స్థాయిలు. ముఖ్యం గా 14780 స్థాయి కీలకం . ఐతే ప్రపంచ మార్కెట్లు సానుకూలం గా ఉంటే ఈ వారం మార్కెట్లు కొంత ఎగబాక వచ్చు . 15568, 15995 అవరోధాలు సెన్సెక్స్ నకు అతి కీలకం ఆ తరువాత 16002-16111-16452 అవరోధాలు సెన్సెక్స్ నకు ముఖ్యమైనవి .