17-08-2009::1:30 pm ట్రేడింగ్ బలహీనత: భారీగా క్షీణించిన సెన్సెక్స్

బాంబే స్టాక్ మార్కెట్ భారీ నష్టాల దిశగా పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీగా పతనమైన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. సోమవారం 1:30 గంటల ప్రాంతంలో 440 పాయింట్లు భారీగా పడిపోయి.. 14959 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 142పాయింట్లు క్షీణించి 4, 438 పాయింట్ల వద్ద పయనిస్తోంది. విదేశీ మార్కెట్ల ట్రేడింగ్ బలహీనతతో పాటు దేశీయ కంపెనీలు అమ్మకపు ఒత్తిడిని చవిచూడటంతో సెన్సెక్స్ తిరోగమనం వైపు పయనిస్తోందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. అంతేగాకుండా రియాల్టీ, మెటల్, ఆటో, బ్యాకింగ్ వాటాలు అమ్మకాల వైపు మొగ్గు చూపడంతో బాంబే స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసిందని వారు చెబుతున్నారు.ఇకపోతే.. బెంగాల్సమ్, ఆర్ఆర్‌ఫిన్ కాన్స్ వంటి సంస్థలు లాభాలను నమోదు చేసుకోగా, సియాస్‌గ్లోబ్, శ్రీ గ్లోబల్ వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

17-08-2009 :: 8 am

అమెరికా కొనుగోలు దారుల విశ్వసనీయత ఇండెక్స్ 68 పాయింట్ల నుండి 63 పాయింట్లకు పడిపోవటం తో గత ట్రేడింగ్ లో అమెరికా మార్కెట్లు కుదేలు మన్నాయి. ఈ అంశానికి అప్పటివరకు లాభాల లో పయనిస్తున్న ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల తో స్పందించాయి.

ఆసియా మార్కెట్ల పై కూడా , ఈ ప్రభావం ఇదే రీతిన నేడు ఉండటం వలన ,మన మార్కెట్లు ఈ రోజు కూడా శుక్రవారపు నష్టాల ప్రక్రియని కొనసాగించే అవకాశం ఉంది.

దేశం లో తీవ్ర అనావృష్టి గురించి ప్రధాని స్వతంత్ర వేడుకల లో ప్రస్తావించటం కూడా మార్కెట్ల కి వర్షాభావ పరిస్థి గురించి మరొక సారి గుర్తు చేసినట్లయ్యింది. ఈ అంశం మార్కెట్లకి కొంత దిగులు కలిగించ నుంది.

టెక్నికల్ గా పరిశీలిస్తే, సెన్సెక్స్ గత మూడు వారాలు గా 15540 ~ 16002 పాయింట్ల అవరోధాన్ని చెదించ లేక పోతున్నది. అందుచేత , ప్రపంచ మార్కెట్ల లో ప్రస్తుతం నెలకొని వున్న నిరాశ పరిస్థితి ని , మన మార్కెట్లు స్వల్ప కాల ( భారి) దిద్దుబాటు కి ఉపయోగించుకునే అవకాశం ఉంది. సెన్సెక్స్ నకు 15020 పాయింట్ల మద్దత్తు స్థాయిని మరొక సారి బుల్ల్స్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. నేడు మాత్రం మార్కెట్లు నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15412
  • అవరోధాలు : 15568-15769-15814
  • మద్దత్తులు: 15370-15169-15020 -14930