- 17-08-2009:: 7:30pm
- మార్కెట్ రిపోర్ట్
బలహీన మైన చైనా మార్కెట్ల నేపథ్యం లో నేడు మన మార్కెట్లు రక్తసిక్తం అయ్యాయి. ఇంత భారి స్థాయి లో మార్కెట్లు నష్ట పోవటం, బడ్జెట్ అనంతరం ఇదే ప్రథమం. ఐతే , మార్కెట్లు భారి గా నష్టపోతాయాని , మార్కెట్లు పెరిగినప్పుడు అమ్మకాలు జరపటం శేయేస్కరమని గత నాలుగు రోజులు గా మేము పదే పదే సూచించటం మీకు తెలుసు.
నేడు సెన్సెక్స్627 పాయింట్లు కోల్పోయి14785 వద్ద ముగిసింది. ఇది మేము నిన్న ప్రచురించిన " మార్కెట్ ముందు చూపు " శీర్షిక లో సూచించిన 14, 780 పాయింట్ల మద్దత్తు కి అత్యంత సమీపం గా గుర్తించాలి.
నేడు నిఫ్టీ192 పాయింట్లు బలహీన పడి 4388 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.13 % నష్టపోగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.90 % నష్టపోయింది. నేటి ట్రేడింగ్ లో అన్ని రంగాలు నష్టాలను చవిచూసాయి. నేడు రియాలిటీ రంగం నష్టాలలో 7.6 % క్షీణించి , ప్రథమ స్థానం లో నిలువగా, మెటల్స్ 6.2% నష్టపోయి bears పంజా కి బలి అయ్యింది.
సెన్సెక్స్ స్టాకు లలో DLF 7.8 %, HINDALCO 7.4 % అత్యధిక నష్టాలు నమోదు చేసాయి.