• 13-08-2009 :: 6:50 pm
  • మార్కెట్ రిపోర్ట్

బలమైన ప్రపంచ మార్కెట్ల సహాయం తో నేడు మన మార్కెట్లు అనూహ్యంగా లాభాలను అర్జించింది. నేడు సెన్సెక్స్ 498.33 పాయింట్లు లాభ పడగా , నిఫ్టీ 147.50 పాయింట్లు ఎగబాకింది. ఉదయం, మా అంచనాలకు అనుగుణం గా గ్యాప్ అప్ తో ప్రారంభమైన సెన్సెక్స్ 15208 పాయింట్ల వద్ద నుండి ప్రస్థానం ప్రారంభించి ఆద్యంతం లాభాల బాట లో నడిచింది.

మేము ఉదయం సూచించిన అంశాలు , అంటే అమెరికా ఫెడ్ అధ్యక్షులు ఇచ్చిన భరోసా, సానుకూలమైన IIP గణాంకాలు , ఆదాయపు పన్ను పై ఆర్ధిక మంత్రి చేసిన ప్రతిపాదనలు , తదుపరి మధ్యాన్నం ఐరోపా భారి లాభాల తో ప్రారంభం వలన మన మార్కెట్ల లో నేడు బుల్ల్స్ ఆధిపత్యం పూర్తి గా కొనసాగింది .ఒక దశ లో సెన్సెక్స్ గరిష్టం గా 15545 పాయింట్ల వరకు ఎగబాకింది. నేడు విడుదల అయిన ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా బుల్ల్స్ జోరుకు కొంత సహాయ పడిందని చెపాలి . ఆగష్టు 1 తాలూకు ద్రవ్యోల్బణం -1.74 % గా నమోదు అయ్యింది. గత వారం విడుదల ఐన గణాంకాలు -1.56 % గా ఉండింది.

చివరకు సెన్సెక్స్, నేడు, 15518 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 148 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో స్మాల్ క్యాప్ రంగం 4.11 %వృద్ధిని నమోదు చేయగా, మిడ్ క్యాప్ రంగం 3.59 % వృద్ధి పొందింది.

నేటి ట్రేడింగ్ లో అన్ని రంగాలు లాభాలను ఆర్జించటం విశేషం. ఐతే రియాలిటీ రంగం అత్యధికం గా 6.86 % , మెటల్స్ 5.57 % లాభాలను ఆర్జించాయి.

నేటి సెన్సెక్స్ స్టాకు ల లో DLF 7.2 %, ICICI BANK 6.5% లాభాలను ఆర్జించాయి. నేడు సెన్సెక్స్ స్టాకు లన్ని కూడా లాభాలను ఆర్జించటం విశేషం