13-08-2009 :: 8:00 AM

మార్కెట్ నాడి

ఆర్ధిక మాంద్యం అంతమయ్యే సూచనలు కనిపిస్తున్నందున అమెరికా ఫెడ్ అధ్యక్షులు బెన్ బెర్నంకే నిన్నచేసిన ప్రకటన వలన అమెరికా మార్కెటు భారి గా లాభ పడ్డాయి. అదే విధం గా బ్లూమ్ బర్గ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తం గా మదుపర్ల లో , మార్కెట్ల పట్ల విశ్వాసం, మనోస్తైర్యం పెరుగుతోందని వెల్లడయ్యింది. గత నెల ఇండెక్స్ 38 % నమోదు కాగా, నెల ఇది 54% గా నమోదు అయ్యింది అని తేల్చిచెప్పింది.

నేడు ఆసియా మార్కెట్లు కూడా గ్యాప్ అప్ తో ప్రారంభామవ్వటం కూడా మన మార్కెట్ల లో ని బుల్ల్స్ కి ఉత్సాహం కలిగించ నున్నది. IIP గణాంకాలు సానుకూలం గా వెలువడటం నిన్న మన మార్కెట్ల లో ప్రాణం పోసిందన్న విషయం మీకు తెలుసు. నేడు WPI గణాంకాలు విడుదల కానున్నాయి .

నేడు విడుదల కానున్న ద్రవ్యోల్బణ గణాంకాలు మన మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం లేక పోలేదు.

ఐతే స్వయిన్ ఫ్లూ కారణం గా ముంబై నగరం లో మల్టీ ప్లేక్సులు, సినిమా హాళ్ళు, స్కూళ్ళు మూడు రోజుల పాటు మూసివేయటం , ఈ ఫ్లూ తీవ్రత ని మనం అంచనా వేయవచ్చు. ఇది కేవలం ఆరంభం మాత్రమె అని కూడా మనం మరువ కూడదు. దేశం లో వర్షాభావ పరిస్థితి లో కూడా పెద్ద మార్పు లేదు కనుక , నిన్న మన మార్కెట్ల లో చివరి గంట లో కనిపించిన ఉత్సాహం , నేడు కూడా కనిపించినా , స్వయిన్ ఫ్లూ అంశం మరొక సారి తెర మీదకి రాక మానదు. ఈ అంశం రానున్న రోజుల లో మార్కెట్ సెంటిమెంట్ ని మరొక సారి దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి

నేడు మార్కెట్లు పెరిగినా దీర్ఘ కాలిక మదుపర్లు , మదుపు పెట్టేందుకు తొందర పడవలసిన అవసరం లేదనే చెప్పాలి.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15020
  • అవరోధాలు : 15169-15264-15370 -15466
  • మద్దత్తులు: 14930-14831-14781