• 12-08-2009:: 6 30 PM

  • మార్కెట్ రిపోర్ట్

భారి ఆటు పొట్ల నడుమ నేడు మన మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి. నేడు మన మార్కెట్లు Roller coaster ప్రయాణాన్ని తలపింప జేసాయి. మేము ఉదయం సూచించిన విధం గా సెన్సెక్స్ నష్టాలో తో 14953 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. స్వయిన్ ఫ్లూ కారణం గా బలహీన సెంటిమెంట్ నడుమ మార్కెట్లు క్రమేపి మరింత క్షీణించి , సెన్సెక్స్ సూచీ కనిష్టం గా 14701 పాయింట్ల కు పడిపోయింది. ఐతే మధ్యాన్నం ఐరోపా మార్కెట్లు క్రమంగా పుంజుకోవడం తో మన మార్కెట్లు కూడా నష్టాలను పూరించుకునే ప్రయత్నం చేసాయి. ఇందుకు నేడు విడుదల అయిన జూన్ తాలూకు పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు మార్కెట్ లో కొంత ఊపిరి పోశాయి. ఈ గణాంకాలు గత 16 నెలల కాలం లో అత్యుత్తమ ఫలితాలు కావటం తో మార్కెట్ల లో కొంత ఉత్సాహం చోటుచేసుకున్నాయి. జూన్ నెల కి పారిశ్రామిక ఉత్పత్తి లో 7.8% వృద్ధి కనరావటం విశేషం. మార్కెట్ చివరి గంట ట్రేడింగ్ లో చోటు చేసుకున్న షార్ట్ కవేరింగ్ కూడా సెన్సెక్స్ నష్టపోయిన ౩౦౦ పాయింట్లను తిరిగి , దాదాపు పూరించు కునేందుకు దోహద పడింది. చివరికి సెన్సెక్స్ కేవలం 54 పాయింట్ల స్వల్ప నష్టం తో రోజుని ముగించగా, నిఫ్టీ 14 పాయింట్లని BEARS కి అప్పచెప్పింది.

నేటి ట్రేడింగ్ లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ అత్యధికం గా .047 % లాభ పడగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ ౦.28 % లాభ పడింది.

నేటి ట్రేడింగ్ లో రియాలిటీ రంగం 2.15% , హెల్త్ కారే రంగం 1.31 % లాభ పడటం విశేషం. కాగా మెటల్స్ రంగం 1.63 %, ఐ.టి రంగం 1.78 % నష్టాలను చవిచూసాయి.

సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే BHARTI AIRTEL 5.8 % ,TATA MOTORS 4.4 % లాభాలను ఆర్జించగా , TATA STEEL, TCS 4.2% , 4.1 % బలహీన పడ్డాయి.