12-08-2009 :: 8.10 AM
మార్కెట్ నాడి
దేశం లో స్వయిన్ ఫ్లూ అన్ని వర్గాల కు ఒణుకు పుట్టిస్తోంది. ఈ వ్యాధి మరింత తీవ్ర రూపం దాల్చనున్నదని సంబంధిత వర్గాలు తలియజేస్తున్నాయి. WORLD HEALTH ORGANISATION ప్రకారం MEXICO ( మన దేశ అభివృద్ది, ఆరోగ్య , విద్య సదుపాయాలలో ఇంచు మించు సరిసమం ) లో ఈ వ్యాధి వలన 33 % జనాభా ప్రభావితం అయ్యింది. ఈ అంచనాలని పరిగణం లో కి తీసుకుంటే, మన లో ప్రతీ ముగ్గిరి లో ఒకరు త్వరలో ఈ వ్యాధి గ్రస్తులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ! ఇంత తీవ్ర మైన అంటు వ్యాధి , మన దేశ పరిస్థితి , అధికారుల పని తీరు ని యోచిస్తే ,మన దేశాన్ని మరింత అతలా కుతలం చేసే అవకాశం ఉంది . కేవలం ౦.1 % జనాభా ప్రభావితం అయినా మన దేశం లో ఒక లక్ష మంది కంటే పై చిలుకు మాటే ! కనుక స్టాక్ మార్కెట్లు కూడా భయాందోలనల కి గురి కానున్నాయి కాబట్టి రానున్న వారం రోజులూ కూడా స్టాక్ మార్కెట్లు స్వయిన్ ఫ్లూ నీడల లో ట్రేడ్ కానున్నాయి.
గత రాత్రి అమెరికా మార్కెట్లు కూడా గడిచిన రెండు నెలల లో అత్యంత భారి గా నష్ట నష్టాన్ని నమోదు చేసాయి. నేటి ఉదయం ఆసియా మార్కెట్లు సైతం నష్టాల బాట లో పయనిస్తున్నాయి.
నేడు ప్రత్యక్ష పన్నుల ముసాయిదా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది. ఇది మార్కెట్లను కొంత ప్రభావితం చేసే అంశమైనా, ముందు చర్చించిన స్వయిన్ ఫ్లూ నేడు మార్కెట్ల సెంటిమెంట్ ని ప్రభావితం చేయనున్నది
మార్కెట్లు పెరిగితే , లాంగ్ పోసిషన్లు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయటం ఉత్తమం. వారం రోజుల తరువాత ధరలు తగ్గినప్పుడు మరల కవర్ చేసుకోవచ్చు.
నేడు మార్కెట్లు పెరిగినా, తగ్గినా, లాంగ్ పోసిషన్లు , వారం - పది రోజుల ముందు చూపు తో చూస్తె , అంత శేయస్కారం కాదు.
టెక్నికల్ గా SENSEX సూచీ ప్రస్తుతం అతి కీలక మద్దత్తు స్థాయి 14930 పాయింట్ల మద్దత్తు వద్ద SUPPORT తీసుకుంటున్నది. క్యాండిల్ చార్ట్ ప్రకారం మార్కెట్లకు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి గోచరిస్తున్నది. 14520 పాయింట్ల వద్ద సెన్సెక్స్ కి మరొక విశేషమైన మద్దత్తు ఉంది.
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 15074
- అవరోధాలు : 15169-15264-15370
- మద్దత్తులు: 14930-14831-14781-14520