• 18-08-2009 :: 5:35 pm

  • మార్కెట్ రిపోర్ట్

షార్ట్ కవెరింగ్ నేపధ్యం లో నేడు మన మార్కెట్లు లాభ పడ్డాయి. దీనితో బొంబాయి సెన్సెక్స్ 250 పాయింట్లు లాభ పడి 15035 వద్ద ముగియగా, నిఫ్టీ 71 పాయింట్లు లాభ పడి 4459 పాయింట్ల వద్ద ముగిసింది.

ఉదయం 14745 పాయింట్ల కు నష్టాల తో ప్రారంభమైన సెన్సెక్స్ కనిష్టం గా 14740 పాయింట్ల కు పడిపోయింది. ఆ తరువాతా క్రమంగా షార్ట్ కవెరింగ్ చోటు చేసుకోవటం తో మార్కెట్లు లాభ పడుతూ వచ్చాయి. మధ్యాన్న సమయానికి ఐరోపా మార్కెట్ల సానుకూల ప్రభావం తో సెన్సెక్స్ గరిష్టం గా 15134 పాయింట్ల వరకు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 1.69 % వృద్ధిని నమోదు చేస్తూ 15035 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.09 % లాభ పడగా , మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.06 % వృద్ధిని నమోదు చేసింది.

నేటి ట్రేడింగ్ లో అన్ని రంగాలు లాభాల తో ముగియటం విశేషం. నేడు క్యాపిటల్ గూడ్స్ రంగం అత్యధికం గా 3.64 % లాభాన్ని నమోదు చేయగా , రియాలిటీ 2.39 % వృద్ధిని నమోదు చేసింది.

ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే నేడు Hindalco 6.08 %, Jai Prakash Associates 4.73 % వృద్ధిని నమోదు చేసాయి. కాగా Infosys స్వల్పంగా ౦.59 % నష్టపోయింది.

18-08-2009 :: 1 :30 pm

ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైన మన మార్కెట్లు , షార్ట్ కవెరింగ్ మూలం గా సుమారు రెండు శాతం మేరకు లాభం పడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 294 పాయింట్లు లాభపడి 15,083 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 90 పాయింట్లు బలపడి 4,477 వద్ద పయనిస్తోంది. ఐరోపా మార్కెట్లు కూడా గ్యాప్ అప్ తో ప్రారంభామవ్వటం తో షార్ట్ కవెరింగ్ ర్యాలీ ఇంకా కొనసాగుతోంది. ఐతే , వచ్చే మూడు నాలుగు రోజుల లో మార్కెట్ల లో బలహీనత మరల చోటుచేసుకునే అవకాశం ఉంది. నేడు ప్రధాన మంత్రి ,దేశం కరువు కోరల్లో చిక్కుకొబొతున్నదని ప్రకటించటం కూడా ఈ అంశానికి బలం చేకూర్చనున్నది. కాబట్టి మదుపర్లు ఈ విషయాని గ్రహించి తదనుగుణం గా ట్రేడ్ చేయటం మంచిది. ప్రస్తుత ర్యాలీ కేవలం షార్ట్ కవెరింగ్ ర్యాలీ అని మారకూడదు.