• 18-08-2009::8 AM.
  • మార్కెట్ నాడి

మా అంచనాలు నిజం చేస్తూ నిన్న మార్కెట్లు ఘోరం గా దెబ్బ తిన్నాయి. చైనా మార్కెట్ల లో కామోడిటి ఇండెక్స్ భారిగా పతనమవ్వటం తో ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్ బలహీనపడింది. పైగా నిన్న విడుదల అయిన జపాన్ GDP గణాంకాలు అంచనాల కంటే 0.9 % తక్కువగా ఉండటం తో ఆసియా మార్కెట్లు మరింత నష్టపోయాయి. ఈ ప్రభావం అమెరికా మార్కెట్ల పై గూడ గత రాత్రి కనిపించింది. అమెరికా మార్కెట్లు Dow Jones 2.04% Nasdaq 2.83% S &P 500 - 2.49% మేరకు నిన్న పతనమయ్యాయి. . నిన్నటి ట్రేడింగ్ లో S& P కీలక మద్దత్తు స్థాయి కొల్పోయినందున ప్రస్తుతం ఉన్న980 పాయింట్ల మార్కు నుండి సుమారు 869 పాయింట్ల వరకు క్షీణించే అవకాశం ఉంది. ఈ ప్రభావం మన మార్కెట్ల పై తప్పక ఉండ నున్నది .మన మార్కెట్లు కూడా ప్రపంచ మార్కెట్ల కు అనుసంధానం గా రానున్న రోజుల లో మరింత పతనం కానున్నది.

మన మార్కెట్లు ఈ విధం గా తీవ్రమైన దిద్దుబాటు కి గురికానున్నదని , మార్కెట్లు పెరిగినప్పుడు అమ్మకాలు జరుపుకోవాలని , మేము గత వారం పదే పదే హెచ్చరించటం మీకు తెలుసు.

మార్కెట్ల లో కొనుగోళ్ళు కనిపించవు కాబట్టి సెన్సెక్స్ నకు కీలక మద్దత్తు 50 DMA అయిన 14780 పాయింట్లు నిలబడే అవకాశం తక్కువ. నేడు ఈ మద్దత్తు నిలబడినా, రేపో మాపో మరల పతనం కానున్నది.

టెక్నికల్ గా సెన్సెక్స్ చర్టులలో HEADS AND SHOULDERS PATTERN కనవస్తున్నందున మారెట్ల పై BEARS తమ సత్తా చూపనున్నాయి. కాబట్టి ఇప్పుడే తొందర బడి పెట్టుపడులు పెట్టకుండా ఉండటం మంచిది.

నేడు సెన్సెక్స్ లో షార్ట్ కవేరింగ్ ర్యాలీ వచ్చి , మార్కెట్లు పెరుగుతున్నా , కొనుగోళ్ళు చేయకుండా ఉండటం మంచిది.డే ట్రేడింగ్ చేసే వారు స్క్రిప్టు వారిగా , మద్దత్తు స్థాయిలను పరిశీలించిన తరువాతే పొసిషన్స్ తీసుకోవటం ఉత్తమం. .

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 14785
  • మద్దత్తులు : 14665-14530- 14428-14253
  • అవరోధాలు : 14888-14930-15020