19-08-2009 :: 8AM
- మార్కెట్ నాడి
షార్ట్ కవేరింగ్ నేపథ్యం లో నిన్న లాభ పొందిన మన మార్కెట్లు, నేడు తదుపరి దిశ కోసం ప్రపంచ మార్కెట్ల వైపు దృష్టి సారించ నున్నాయి. గత రాత్రి అమెరికా మార్కెట్లు గృహ సంబంధిత రిటైల్ కంపనీ ప్రకటించిన ఉత్తమ ఫలితాల నేపథ్యం లో అక్కడి మార్కెట్ల సెంటిమెంట్ బలపడి లాభపడ్డాయి.
కాగా నేడు ఆసియా మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకి గురి అవుతున్నందున, మన మార్కెట్ల లో సైతం ఇదే ధోరణి కనిపించే అవకాశం ఉంది.
ఋతుపవనాల లో కొంత ప్రగతి కనిపించటం తో పరిస్థితి కోలుకోవచ్చని వాతావరణ శాఖ ప్రకటన , దేశం లో కరువు నేలకోనిఉన్న , GDP వృద్ధి 6% వుండగలదని ఆర్ధిక మంత్రి భరోసా ఇవ్వటం , నేడు మన మార్కెట్ సెంటిమెంట్ ని నిలబెట్టే ప్రయత్నం చేయనున్నాయి. ఈ ప్రకటనలకి మారేక్ట్ సానుకూలం గా స్పందిస్తే, గత సోమవారం భారి గా నష్టపోయిన లోహ రంగానికి చెందినా స్టాకు ల లో కొంత కొనుగోళ్ళు కనిపించే అవకాశం ఉంది.
టెక్నికల్ గా పరిశీలిస్తే ,గత ముగింపు లో సెన్సెక్స్ లాభం పడి అతి కీలక 14780 పాయింట్ల మద్దత్తు నిలుపుకోవటం మన మార్కెట్ల కు కొంత ఊరట కలిగించే విషయం. ఈ మద్దత్తు నిలిచినంత కాలం ప్రమాదం లేనట్లే అని చెప్పవచ్చు. ఐనప్పటికీ అనిశ్చిత ధోరణి ఇంకా నెలకొని ఉంది మార్కెట్ , నేడు మార్కెట్లు ప్రారంభం లో కొంత ఆటుపోట్ల కి గురి అయ్యే అవకాశం ఉంది. మధ్యాన్నం తదుపరి, ఐరోపా మార్కెట్లను అనుసరించి , కొంత నిలకడ సాధించే అవకాశం ఉంది.
-
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
-
గత ముగింపు: 15035
-
అవరోధాలు: 15080 -15169-15370-15446
-
మద్దత్తులు ::14930-14888-14780
-