• 11-08-2009 :: 6:40 pm

  • మార్కెట్ రిపోర్ట్

మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ.. మంగళవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 65 పాయింట్లు లాభపడి 15,075 వద్ద నిలచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 34 పాయింట్లు పుంజుకుని 4,471 వద్ద పయనిస్తోంది.మూడు రోజుల వరుస నష్టాలను కొనసాగిస్తూ.. ఈ రోజు ఉదయం 15వేల మార్కు వద్ద స్టాక్ మార్కెట్ స్థిరంగా ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లోనే కనిష్ఠంగా 14,864 వద్దకు సెన్సెక్స్ పడిపోయింది. ఇది మా అంచనాలకు అనుగుణం గా జరగటం విశేషం. వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశంలోని 161 జిల్లాలు కరువు పీడిత ప్రాంతాలుగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు.ఈ ప్రకటనతో ఇన్వెస్టర్ల ఆందోళనలు పెరిగాయి. దీంతో స్టాక్ మార్కెట్ మరింత నష్టాలలో కూరుకుపోయింది. అయితే దేశ జాతీయ స్థూల ఉత్పత్తి గురించిన సానుకూల సంకేతాల సాయంతో ఇండెక్స్ తిరిగి పుంజుకుంది. ఈ రికవరీలో లాభాల్లోకి ప్రవేశించింది.దీంతో ఈ లాభాల ప్రక్రియలో ఇండెక్స్ 354 పాయింట్లు బలపడి 15,218 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది.

ఐతే మధ్యాన్నం తాజా ట్రేడింగ్ లో ఐరోపా మార్కెట్లు బలహీన పడేసరికి మన మార్కెట్లు కూడా రెడ్ మార్కు లో ప్రవేశించాయి. ముగింపు సమయం లో జరిగిన షార్ట్ కవేరింగ్ వలన మార్కెట్లు మరల కొంత పుంజుకున్నాయి.

వరసుగా మూడు రోజులు నష్టాల్లో పయనించిన సెన్సెక్స్ నేడు 0.43 శాతం వృద్ధి చెందింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ నేడు 0.55 శాతం , మిడ్ క్యాప్ 1.10 % లాభ పడింది.

నిన్న నష్టాలతో ముగిసిన బీఎస్ఈ ఆటో ఇండెక్స్ నేడు స్టాక్ మార్కెట్ లాభాల్లో నడిచేందుకు దోహదం చేసిన వాటిల్లో ఒకటైంది. కాగా,రియాల్టీ మరియు మెటల్ (లోహ) ఇండెక్స్‌లు 2 శాతం చొప్పున బలపడ్డాయి. నేడు కేవలం పి. ఎస్. యు . రంగం 0.02% క్షీణించి ఏకాకి గా మిగిలింది.

ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే టాటా మోటార్స్ అత్యదికం గా 6.8 % వృద్ధిని నమోదు చేసింది. Tata motors ని కొనుగోలు చేయమని JP MORGAN AGENCY , FII లకు జారి చేసిన అంశం నిన్ననే మేము తెలియ చేసిన విషయం మీకు తెలుసు. MNM నేడు 3.6 % వృద్ధి చెందింది. నేటి ట్రేడింగ్ లో JP ASSOCIATES, HDFC 2.6 %, 1.1 % చొప్పున నష్టపోయాయి.

  • .