11-08-2009 :: 8 am.

మార్కెట్ నాడి

గత రాత్రి అండమాన్, కోస్తా ఆంధ్రా ప్రాంతం లో చోటు చేసుకున్న భూప్రకంపనలు, జారి అయి - తిరిగి ఉపసంహరింప బడ్డ సునామి హెచ్చరికలు , స్వయిన్ ఫ్లూ కారణం గా పూణే లో పాఠశాల మూసివేత , ఈ వారం చివరి కైనా వర్షం పడక పొతే దేశం లో తీవ్ర కరువు రాబోతున్నదన్న వాతావరణ శాఖ ప్రకటన, వర్షాభావ పరిస్థితి వలన దేశం వృద్ధి రేటు 6.8 % మాత్రమె ఉండే అవకాశాలని అంచనాలు - ఈ అంశాలు మన మార్కెట్ సెంటిమెంట్ ని నేడు తీవ్ర స్థాయి లో దెబ్బ తీయనున్నాయి.

గత రాత్రి అమెరికా మార్కెట్లు కూడా ఆద్యంతం నష్టాలలో పయనించటం, నేటి ఆసియా మార్కెట్లు ఆటు పొట్ల తో నష్టాలలో పయనించటం వంటి అంశాలు మదుపర్ల మనోస్థైర్యాన్ని ప్రతికోలం గా ప్రభావితం చేసే అంశాలు.

ఈ నేపథ్యం లో , వరుస నష్టాలలో పయనిస్తున్న మన మార్కెట్ల లో నేడో , రేపో ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కొనుగోళ్ళు చేయటం కంటే , ఆ ర్యాలీ ని ఎగ్జిట్ అయ్యేందుకు , మదుపర్లు ఉపయోగించుకోవటం ఉత్తమం.

టెక్నికల్ గా కూడా FIBINOCCI అనాలిసిస్ ప్రకారం మార్కెట్లు దిద్దుబాటు కి గురి అయ్యే అవకాశాలు ఉన్నందున , ప్రస్తుతం మదుపర్లు, ట్రేడర్లు కొత్త గా లాంగ్ పోసిషన్లు తీసుకోవటం అంత శ్రేయస్కరం కాదు.

నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు : గత ముగింపు: 15010 అవరోధాలు : 15169-15264-15370 మద్దత్తులు: 14930-14831-14781

  • .