• 10-08-2008 :: 6Pm

  • మార్కెట్ రిపోర్ట్
గత వారాంతంలో భారీ నష్టాలతో ముగిసిన తర్వాత ఈ వారం , మా అంచనాలకి అనుగుణం గా 127 పాయింట్లు బలపడి 15,287 వద్ద స్టాక్ మార్కెట్ (సెన్సెక్స్ ) లాభాల తో ప్రారంభమైంది. తదుపరి 15417 పాయింట్ల వరకు గరిష్టం గా ఎగబాకింది. ఐతే దేశం లో వర్షాభావ పరిస్థితి , స్వయిన్ ఫ్లూ అంశాలు మార్కెట్ సెంటిమెంట్ ని దెబ్బ తీసాయి. దీనితో మార్కెట్లు బలహీన పడుతూ , ఆటుపోట్ల కు గురయ్యింది. ఒక దశ లో సెన్సెక్స్ సూచీ కనిష్టం గా 14903 పాయింట్ల వరకు క్షీణించింది. ఇది మేము సూచించిన కీలక మద్దత్తు స్థాయి కి సమీపం గా ఉండటం వలన , మరల కొంత పుంజుకొని చివరకు, ఆసియా మార్కెట్ల లో మన మార్కెట్లే అతి పేలవమైన ప్రదర్శన యిస్తూ 15010 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగియగా , నిఫ్టీ 44 పాయింట్లు నష్ట పోయి 4438 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేటి ట్రేడింగ్ లో 150 పాయింట్లు బలహీన పడింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.71 % , స్మాల్ క్యాప్ రంగం 1.95 % మేరకు క్షీణించాయి.
నేటి ట్రేడింగ్ లో కేవలం ఐ.టి ఇండెక్స్ 2.64 %, టెక్ ఇండెక్స్ 0.97 % చొప్పున లాభపడగా, మిగిలిన అన్ని రంగాలు తీవ్రం గా నష్ట పోయాయి. ముఖ్యం గా వర్షా భావ పరిస్థితి వలన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన కౌంటర్లు , అంటే ట్రాక్టర్లు , ఆటో స్టాకులు భారి గా నష్టపోయింది. తత్ఫలితం గా ఆటో ఇండెక్స్ 4.52% నష్టపోయాయి. .కాగా FMCG రంగం కూడా గ్రామీణ ప్రాంతాల క్షీనించ బోయే కొనుగోలు శక్తి ని పరిగణం లోకి తీసుకుంటూ 2.96 % నష్టాలను నమోదు చేసింది
ఇక సెన్సెక్స్ స్టాకు ల వారిగా పరిశీలిస్తే , నేడు MNM 9.1 %, ACC 6.5 % నష్టపోగా TCS , విప్రో 6 %, 2.8 % చొప్పున వృద్ధి చెందాయి.
  • .