• 03-08-2009 :: 6 :40 pm

  • మార్కెట్ రిపోర్ట్
ఉదయం ఒడిదుడుకుల తో ప్రారంభమైన మన మార్కెట్లు , మధ్యాన్నం సానుకూల ఐరోపా మార్కెట్ల ప్రభావం వలన భారి గా పుంజుకొని లాభాల్లో ముగిసాయి. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 254 పాయింట్లు వృద్ధి చెంది 15924 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 75పాయింట్ల లాభాలను నమోదు చేసి 4711 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు సెన్సెక్స్ , నిఫ్టీ 1.62 శాతం చొప్పున వృద్ధి పొందాయి. ఈ ముగింపు గత 14 నెలల గరిష్ట స్థాయి కావటం విశేషం.
నేడు పార్లమెంట్ లో , గ్యాస్ వినియోగంపై నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమేనని అలాగే గ్యాస్ ధరలపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి మురళి దేవరా ప్రకటించారు. RIL -RNRL కుటుంబ సమస్య అని, వారి వివాదంతో, కేజీ బేసిన్ గ్యాస్ వివాదంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని గ్యాస్ వినియోగంపై నిర్ణయించేది, దాని ధరలపై కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన తో మార్కెట్లకు కొంత స్పష్టత కలగటం తో మధ్యాన్నం తదుపరి మార్కెట్లు మరింత జోరు అందు కున్నాయి. ఒక సందర్భం లో మార్కెట్లు గరిష్టం గా 15963 పాయింట్ల వరకు చేరుకుంది. చివరకి సెన్సెక్స్ 15924 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం అత్యధికం గా 2.36 % వృద్ధి సాధించటం విశేషం. కాగా స్మాల్ క్యాప్ రంగం 1.74 % వృద్ధిని నమోదు చేసాయి.
నేటి ట్రేడింగ్ లో కన్సుమేర్ డ్యురబుల్స్ , FMCG మినహా అన్ని రంగాలు లాభాల బాట పట్టాయి. ఈ రెండు ఇండెక్స్ లు మాత్రం 0.80 % , 0.71 % చొప్పున నష్టపోయాయి . కాగా, నేడు ఆటో ఇండెక్స్ అత్యధికం గా 4.60 % లాభ పడగా, రియాలిటీ ఇండెక్స్ 4.19 % అత్యధికం గా లాభ పడింది.

సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే హిందాల్కో 8 % , MNM 6.9 % అత్యధికం గా లాభాలను ఆర్జించాయి. కాగా HUL 2.2 %, ITC 0.7 % క్షీణించాయి.

  • ..