• 04-08-2009 :: 8 am

  • మార్కెట్ నాడి
నిఫ్టీ నిన్న 4700 పాయింట్లను అధిగమించి మదుపర్ల లో ఉత్సాహాన్ని నింపగా, నేడు సెన్సెక్స్ 16 వేల మార్కు ని దాటి మానసికంగా మదుపర్లకు మరింత ఊరట ని కలగజేయ నున్నది.
గత రాత్రి అమెరికా మార్కెట్ల లో S & P 1000 పాయింట్లు దాటి రికార్డు సృష్టించటం విశేషం . నవంబర్ తరువాత గరిష్టం గా అమెరికా మార్కెట్లు ముగియటం విశేషం. ఆసియా మార్కెట్లు సైతం భారి లాభా ల లో పయనిస్తున్నందువల్ల నేడు మన మార్కెట్ల లో బుల్ల్స్ జోరు కొనసాగానున్నది. అంతర్జాతీయ మార్కెట్ల లో కమోడిటీ, ముఖ్యం గా కాపర్ ( రాగి ) ధరలు కూడా భారిగా పుంజుకోవడం, ముడి చమురు ధర ప్రతి బ్యార్రెల్ 70 డాలర్ ధరని అధిగమించటం కూడా ఆర్ధిక మాంద్యం తగ్గుదలకి సూచికలని గ్రహించాలి.
ఐతే భారత దేశపు ఎగుమతులు, దిగుమతులు క్షీణించటం కొంత నిరాశ పరిచే అంశమైనా, నేడు అంతర్జాతియ మార్కెట్ల బలమైన సంకేతాల వలన మన మార్కెట్లు లాభ పడే అవకాశాలే ఎక్కువ.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15924
  • అవరోధాలు : 16064-16262-16452
  • మద్దత్తులు: 15814-15769-15661 .
  • ...