• ౦3-08-2009 :: 8:00 AM
  • మార్కెట్ నాడి

వారంతం తర్వాత నేడు మరొక సారి మార్కెట్లు ట్రేడ్ కానున్నాయి. గత శుక్రవారం మార్కెట్లను సానుకూలం గా ప్రభావితం చేసిన అంశాలు, నేడు కూడా మార్కెట్లకు చేయూత నివ్వనున్నాయి. పైగా నిన్న రాత్రి అమెరికా రిజర్వు చైర్మన్ గ్రీన్ స్పం రేడియో ఇంటర్వ్యూ లో అమెరికా మూడవ త్రై మాసికం నుండి సుమారు 2.5 % వృద్ధి చేయగలదని , కొంత జాగ్రత్త వహిస్తే , ఆర్ధిక మాంద్యం నుండి బయటపడ్డట్లే అని భరోసా ఇవ్వటం నేడు మన మార్కెట్ల లో బుల్ల్స్ కి ఉత్సాహం కల్గించే అంశం.

నేడు ఆసియా మార్కెట్లు ఒడిదుడుకుల తో పయనిస్తున్నాయి. ఐతే bears నేడు చైనా నుండి మద్దత్తు తీసుకోనున్నాయి. చైనా లో నిన్నటి నుండి ప్లేగు వ్యాధి ప్రారంభమయ్యింది. వ్యాధి వలన మాధ్యమిక యుగం లో , ఐరోపా లో సుమారు 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని WHO తెలిపింది. కేవలం 24 గంటల్లో ప్రాణాలు , వ్యాధి వలన కోల్పోవటం జరుగుతుంది కనుక, గత మాసం స్విన్ ఫ్లూ ప్రపంచాన్ని భయభ్రాంతులను చేసినట్లు, ప్లేగు కూడా కొంత ప్రభావితం చేసే అవకాశం లేక పోలేదు. పైగా గత వారం ప్రారంభం లో కేవలం చైనా మార్కెట్ల ప్రభావం వలన మన మార్కెట్ల తో సహా ఆసియా మార్కెట్లన్నీ కూడా నష్టపోయాయన్న అంశం సందర్భం లో గమనార్హం. అంశం మదుపర్లు రాబోయే రెండు మూడు రోజుల వరకు గమనించ దగ్గ అంశం.

నేడు పెట్రోలియం శాఖ మంత్రి లోక్ సభ లో RIL -RNRL గురించి ప్రసంగించ నున్నారు. వారు చేయబోయే ప్రకటనలు మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

కారణాలవలన మన మార్కెట్లు నేడు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15670
  • అవరోధాలు : 15769-15814- 15995
  • మద్దత్తులు: 15661 -15446-15347 .