కుప్పకూలిన సెన్సెక్స్....
భారీగా విక్రయాలు సాగడంతో స్టాక్ మార్కెట్ పేకమేడలా కుప్పకూలింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 390 పాయింట్లు కోల్పోయి 15,514 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 4,585 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.45 శాతం, నిఫ్టీ 2.31 శాతం చొప్పున క్షీణించాయి.
నిన్న లాభాలతో ముగిసిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుండి వీచిన మిశ్రమ ఫలితాల ప్రభావంతో ఈ రోజు ఉదయం 22 పాయింట్లు కోల్పోయి 15,881 వద్ద ప్రారంభమైంది. రోజులో తొలి ప్రథమార్థం అంతా సెన్సెక్స్ నష్టాల్లోనే పయనించింది. అయితే మధ్యాహ్నపు ట్రేడ్‌లకు ముందుగా లాభాల్లోకి ప్రవేశించింది.
ఈ లాభాల ప్రక్రియలో సెన్సెక్స్ గరిష్ఠంగా 15,970 వద్దకు చేరుకుంది. అయితే మధ్యహ్నాం రెండు గంటల తర్వాత సెన్సెక్స్ తిరిగి నష్టాల బాటలోకి ప్రవేశించింది. విక్రయాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి ప్రవేశించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ఈ నష్టాల ప్రక్రియలో సెన్సెక్స్ 525 పాయింట్లు క్షీణించి 15,443 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది. జూన్ 1 నుండి ఆగస్ట్ 5వరకు రుతుపవనాలు 25 శాతం కన్నా తక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటన చేసింది. ఈ ప్రకటన అనంతరం మార్కెట్లు ఈ నష్టాలను చవిచూశాయి.
చివరికి సెన్సెక్స్ 390 పాయింట్ల నష్టంతో ముగిసింది. అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు బలహీనపడ్డాయి. బీఎస్ఈ ఆటో ఇండెక్స్ 4 శాతం, బీఎస్ఈ ఎఫ్‌సీఎంజీ, మెటల్, రియాల్టీ ఇండెక్స్‌లు 3 శాతం చొప్పున క్షీణించాయి. కాగా, సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,765 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,607 కంపెనీల వాటాలు నష్టపోయాయి. అలాగే 1,084 కంపెనీల వాటాలు లాభపడ్డాయి.
నష్టాలను చవిచూసిన కంపెనీలు
టాటా మోటార్స్, హిండాల్కో, జైప్రకాశ్ అసోసియేట్స్, మారుతీ సుజుకీ, హీరో హోండా, స్టెరిలైట్, ఏసీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, టాటా స్టీల్, రిలయన్స్, హిందుస్థాన్ యునిలివర్, గ్రాసిం, ఓఎన్‌జీసీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, డీఎల్ఎఫ్, ఎస్‌బీఐ, టీసీఎస్ తదితర సంస్థల వాటాలు నష్టాలను చవిచూశాయి.
లాభపడ్డ కంపెనీలు
సన్ ఫార్మా మినహా మరే ఇతర కంపెనీలు ఆశించిన స్థాయిలో లాభపడలేదు.