• 07-08-2009 :: 8 : 15 AM

  • మార్కెట్ నాడి

ఆసియా మార్కెట్ల లో కమాడిటి ధరలు భారి గా క్షీనించటం , దేశం లో కరువు తాండవం చేయవచ్చన్న వాతావరణ శాఖ నివేదిక, మార్కెట్ల ల లో కొత్త గా IPO ల వెల్లువ కారణం గా నిన్న మార్కెట్లు భారిగా పతనమయ్యాయి. నిన్నటి కీ , నేటి కీ పరిస్థితి లో పెద్ద మార్పులేక పోవటం, నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు సైతం నష్టపోవటం వంటి అంశాలు నేడు BEARS కి ప్రధాన ఆయుధాలు. మహారాష్ట్రా లో స్వైయిన్ ఫ్లూ కేసులు విశేషం గా నమోదు కావటం కూడా నేడు మార్కెట్లను కలవర పరిచే అంశం. అదీ కాక మేము చర్చించిన విధం గా నే బ్లూమ్ బర్గ్ సంస్థ కూడా దేశం లో కలగ బోయే చెరుకు పంట నష్టం , తత్ఫలితం గా చెక్కర కొరత వంటి అంశాలు ప్రస్తావించటం కూడా స్టాకు ల పరం గా మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.

ఐతే నేడు దక్షిణ కొరియా తో మన దేశం జరుప బోయే వాణిజ్య ఒప్పందం వలన మన దేశం లోని ఫెర్రో- క్రోం , నాప్తా కంపనీలకు లాభాలను చేకూర్చ నున్నది. అదే విధం గా ఆటో రంగం, ఎలక్ట్రానిక్ రంగం కూడాచవుకైన దిగుమతుల వలన కొంత లాభ పడనున్నది . నేడు IIP గణాంకాలు కూడా విడుదల కానున్నాయి . ఈ గణాంకాలు సానుకూలం గా ఉంటే మార్కెట్లు కొంత పుల్ బ్యాక్ ర్యాలీ ద్వారా పుంజుకునే అవకాశం ఉంది.

ఏది ఏమైనా , నేడు మార్కెట్లో పుల్ బ్యాక్ ర్యాలీ చోటు చేసుకుంటే తప్ప , మార్కెట్ కి పరిస్థితి ఆశాజనకం గా లేదు. నేడు వారాంతం కనుక విక్రయదారులు నేడు కూడాసోమ్ము చేసుకునే అవకాశాలు లేక పోలేదు. నేడు పుల్ బ్యాక్ రాలి చోటు చేసుకుంటే మాత్రం అమ్మకాలు చేసుకొని ఎగ్జిట్ కావటం ఉత్తమం.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15514
  • అవరోధాలు : 15568-15769-15814- 15995
  • మద్దత్తులు: 15446-15370-15169-15080