06-08-2009 :: 8 am
మార్కెట్ నాడి
నిన్న ఒడిదుడుకుల తో పయనించిన మన మార్కెట్లు నేడు గడ్డు పరిస్థితి ని ఎదుర్కునేందుకు సిద్దమౌతున్నాయి.
గత రాత్రి అమెరికా మార్కెట్లు భారి గా నష్టపోయాయి. నిరుద్యోగ గణాంకాలు విస్మయ పరుస్తూ వెలువడ గానే అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. దీని ప్రభావం ఆసియా మార్కెట్ల మీద కూడా ఉండటం తో , నేటి ఉదయం ఆసియా మార్కెట్లు కూడా ఒడిదుడుకులతో , మిశ్రమంగా పయనిస్తున్నాయి
ఋతు పవనాల గమనం పై వాతావరణ శాఖ ప్రకటన కూడా అత్యంత నిరాశా , నిస్పృహలను కలిగించే విధం గా ఉండటం , ఇప్పటి కే మహా రాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ మున్నగు రాష్ట్రా ల లో కొన్ని జిల్లాలను కరువు ప్రాంతాలు గా ప్రకటించటం పట్ల మన మార్కెట్లు నిరుత్సాహ పడనున్నాయి.
నేడు గురవారం కనుక , ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ అంశం కూడా మన మార్కేట్లని ప్రభావితం చేసే అవకాశం లేక పోలేదు. పైగా నేడు, రేపు బ్యాంకు ల సమ్మె కనుక , ఈ ప్రభావం ట్రేడింగ్ , టర్న్ ఓవర్ మీద పడనున్నది.
నేటి పరిస్థితి అంత ఆశా జనకం గా కనిపించట్లేదనే చెప్పాలి.
-
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
-
గత ముగింపు: 15904
-
అవరోధాలు : 15994-16110-16262
-
మద్దత్తులు: 15834-15769-15661 . ...