• 10-08-2009 :: 8 :30 AM

  • మార్కెట్ నాడి
గత రెండు రోజులు గా భారి ప్రాఫిట్ బుకింగ్ కి గురి అయిన మన మార్కెట్లు నేడు సానుకూల ప్రపంచ వాతావరణం మధ్య ప్రారంభం కానున్నాయి.
గత శుక్రవారం అమెరికా లో ఆశ జనక నిరుద్యోగ గణాంకాల నడుమ లాభాలను ఆర్జించింది. జపాన్ లో మెషిన్ ఆర్డర్లు గత నాలుగు నెల ల లో మొదటి సారిగా పెరగటం వంటి అంశాలు ఆసియా మార్కెట్లను సానుకూలం గా ప్రభావితం చేస్తున్నాయి. మన మార్కెట్లను పరిశీలిస్తే, గత రెండు ట్రేడింగ్ రోజుల లో నష్టపోయిన మన మార్కెట్ల లో , బలమైన ప్రపంచ మార్కెట్ల సంకేతాల నడుమ ,నేడు ఒక పుల్ బ్యాక్ ర్యాలీ కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. పైగా జే. పి .మార్గన్ ఏజెన్సీ మన దేశపు రేటింగ్ ని పెంచటం కూడా మన మార్కెట్లను ఉత్సాహ పరచ నున్నాయి.
ఐతే పెరుగుతున్న పప్పు దినుసులు, చెక్కర, వంట నూనె వంటి అంశాల పై ప్రధాన మంత్రి స్వయం గా ద్రుష్టి పెట్టటం వంటి అంశాలు భవిష్యత్తు లో పెరగ బోయే ద్రయోల్బనానికి సూచన క్రింద ఇది భావించవచ్చు. స్వయిన్ ఫ్లూ , వర్షాభావ పరిస్థితి , కరువు దేశం లో తాండవం చేయటం వంటి అంశాలు కూడా మన మార్కెట్లను , గత శుక్రవారం లాగే ప్రభావితం చేయనున్నాయి.
ఈ అంశాల నడుమ నేడు మార్కెట్లు కొంత ఆటు పొట్ల కు గురి అయ్యే అవకాశం ఉంది. ఐతే అంతర్జాతీయ మార్కెట్ల సహాయం తో నేడు బుల్ల్స్ కొంత పుంజుకునే సూచనలు ఉన్నాయి.
టెక్నికల్ గా పరిశీలిస్తే గత శుక్రవారం సెన్సెక్స్ 15 DMA స్థాయి వీగిపోవటం తో నేటి ట్రేడింగ్ లో14930 సెన్సెక్స్ పాయింట్లు అతి కీలకం. ఈ వారం మన మార్కెట్ల దిశని నేటి ట్రేడింగ్ నిర్ధారించ నున్నది.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15160
  • అవరోధాలు : 15370-15446-15568
  • మద్దత్తులు: 15169-15080 -14930