• 10-08-2009 :: 00.35 hrs
  • మార్కెట్ ముందు చూపు
  • (10-08-2009 నుండి 14-08-2009 )

గత వారం మన మార్కెట్లు సుమారు 800 పాయింట్లు కేవలం రెండు రోజుల లో కోల్పోయి మరొక సారి మదుపరులను అనిశ్చిత ధోరణి లో పడవేసింది. దేశం లో వర్షా భావ పరిస్థితి మార్కెట్ల పై ప్రతికూల ప్రభావం , కొత్త IPO వలన మార్కెట్ల నుండి కొంత ధనం సెకండరీ మార్కెట్ల నుండి ప్రైమరీ మార్కెట్ల వైపు బదిలీ అయ్యే అవకాశం ఉందని మేము గత వారమే చర్చించిన విషయం మీకు తెలుసు. మా అంచనాలకు అనుగుణం గా మార్కెట్లు పయనించాయి . ఈ వారం కూడా ఈ రెండు అంశాలు మన మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యం గా వారంతం లో ఈ తీవ్రత అధికం గా ఉండి మన మార్కెట్ల మీద ప్రతికూలం ప్రభావం చూపే అవకాశం ఉంది.

కంపనీల త్రైమాసిక ఫలితాలు పూర్తి అయినందున మార్కెట్లు మును ముందు ఉత్సాహ పరిచే అంశాలు పెద్ద గా లేవు. ఈ వారం ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ( ఉత్పత్తి ) గణాంకాలు విడుదల కానున్నాయి. ఇది సాను కూలం గా ఉంటే, గత మాసం లో ని రీతి గా , ఈ సారి కూడా మార్కెట్లు భారి గా వృద్ధి చెందే అవకాశం ఉంది. అదే విధం గా గత రెండు ట్రేడింగ్ రోజుల లో ఏర్పడిన షార్ట్ పొసిషన్స్ కూడా కవర్ చేసుకే ప్రయత్నం ట్రేడర్లు చేయవచ్చు. ఈ కారణం వలన ఈ వారం ప్రారంభం లో మార్కెట్లు కొంత పుంజుకునే అవకాశం ఉంది. పైగా గత శుక్రవారం అమెరికా లోని నిరుద్యోగ గణాంకాలు ఆశాజనకం గా ఉండటం ఆర్ధిక మాంద్యం తగ్గుదల కి సూచన గా భావించ వచ్చు. ఈ అంశం కూడా మన మార్కెట్లను లాభాల బాట లో పయనింప చేయవచ్చు. ఐతే వారాంతానికి ఆసియా మార్కెట్లు దిద్దుబాటు ధోరణి కి గురి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి కే ప్రపంచ మార్కెట్లు భారి గా వృద్ధి చెందటం వలన ఈ అంశానికి దోహద పడనున్నాయి. పైగా మన దేశ పరిస్థితి ని సమీక్షిస్తే, దేశం లో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొని ఉండటం, స్వయిన్ ఫ్లూ దేశం లో , ముఖ్యం గ మహారాష్ట్ర లో ఆందోళన కలిగించటం వంటి అంశాలు మన మార్కేట్లని వారం చివర్లో కొంత బెరుకు ధోరణి కి లోను పరిచే అవకాశం ఉంది.
టెక్నికల్ గా పరిశీలిస్తే మార్కెట్లకి గత వారం వర్తించిన అవరోధాలు ఈ సారి గూడా వర్తించ నున్నాయి. ఈ వారం సెన్సెక్స్ నకు 15370-15568-15814-15995 పాయింట్లు అవరోధాలు. కాగా 15169-15080-14930- 14781-14530 మద్దత్తు స్థాయిలు. ముఖ్యం గా 14930 , 14530 పాయింట్లు సెన్సెక్స్ నకు గట్టి మద్దత్తు స్థాయిలు. కాగా 15568, 15995 అవరోధాలు సెన్సెక్స్ నకు అతి కీలకం. ఈ వారం ప్రారంభం లో మార్కెట్లు కొంత పుంజుకునే అవకాశం ఉంది .ఈ వారం చివరకి మాత్రం రానున్న రోజుల లో జరగ బోయే దిద్దుబాటు ధోరణి కి నాంది పలికే అవకాశం ఉంది.