05-08-2009 :: 6.45 pm
మార్కెట్ రిపోర్ట్
స్టాక్ మార్కెట్ గరిష్ఠ స్థాయి లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 74 పాయింట్లు బలపడి 15,904 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 14 పాయింట్లు బలపడి 4,694 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.46 శాతం, నిఫ్టీ 0.29 శాతం మేరకు వృద్ధి చెందాయి.నిన్న నష్టాలతో ముగిసిన తర్వాత ఈ రోజు ఉదయం 52 పాయింట్ల లాభంతో 15,884 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. అయితే ఉదయం ప్రారంభ ట్రేడ్ అనంతరం స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనించింది. ఈ ప్రక్రియలో సెన్సెక్స్ 278 పాయింట్లు కోల్పోయి 15,695 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది.కానీ, ఇంధన మరియు ఐటీ స్టాకుల్లో తాజాగా సాగిన కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో నడిచాయి . ఇటీవల అంచనాలకు మించి కార్పొరేట్ సంస్థ లాభాలు మరియు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వీచిన సానుకూల సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ద్రవ్య లభ్యత కూడా స్టాక్ మార్కెట్ లాభాలతో పుంజుకునేందుకు దోహదం చేసింది. ఈ లాభాల ప్రక్రియలో సెన్సెక్స్ 143 పాయింట్లు పుంజుకుని 15,973 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది. చివరికి 73 పాయింట్ల లాభంతో 15,904 వద్ద స్టాక్ మార్కెట్ ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.12 % లాభ పడగా , స్మాల్ క్యాప్ రంగం అత్యధికం గా 1 % లాభాలను , మేము ఉదయం సూచించిన విధం గా, నమోదుచేసింది.
ఈ రోజు స్టాక్ మార్కెట్లో బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ , ఆయిల్ మరియు చమురు ఇండెక్స్ సుమారు 2 శాతం, కన్సుమేర్ డ్యుర బుల్స్ 2 .11 శాతం చొప్పున బలపడ్డాయి. కాగా రియాలిటీ రంగం 1.92 శాతం, ఆటో ఇండెక్స్ 1.11 % క్షీణించాయి.
ఇక సెన్సెక్స్ స్టాకు ల ను పరిశీలిస్తే ONGC 4.5 % ఎగబాకింది .కాగా విప్రో 3.2 % లాభ పడింది. నేటి ట్రేడింగ్ లో మారుతి ౩.1 %, హిందాల్కో 1.9 % నష్టాలను చవి చూసాయి.
- ....
- 05-08-2009 :: 8 am
- మార్కెట్ నాడి
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 15830
- అవరోధాలు : 15994-16110-16262
- మద్దత్తులు: 15814-15769-15661 .
- ...