• మార్కెట్ ముందు చుపు
  • (02-08-2009 నుండి 07-08-2009 వరకు )

గత రెండు వారలు గా consolidate అవుతున్న మార్కెట్లు , ఈ వారం పుంజుకో నున్నాయి. కంపనీల ఫలితాలు ఆశా జనకం గా ఉండటం తో మన మార్కెట్లు ప్రస్తుతం పైకి ఎగబాకే ప్రయత్నం లో నే ఉన్నాయి.

ఐతే ఫలితాల సీజన్ చివరి దశ లో ఉంది కనుక , ఈ వారం నుండి మన మార్కెట్ల పై విదేశీ మార్కెట్ల ప్రభావం మరింత గా కనపడనున్నది. రా నున్న రోజుల లో మన మార్కెట్లు విదేశీ మార్కెట్ల తో అనుసంధానం అవ్వనున్నది

అదే విధం గా , మార్కెట్లు ఋతుపవనాల వైపు దృష్టి సారించ నున్నాయి. దేశం లో తీవ్ర మైన వర్షా భావ పరిస్థి ఏర్పడుతున్నందున మార్కెట్లు కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది. ఐతే వర్షాకాలం సెప్టెంబర్ వరకు కొనసాగానున్నది కాబట్టి ఈ భయాలు ఇప్పుడే ప్రస్పుటం కావనే చెప్పాలి. ఏది ఏమైనా, వాతావరణ శాఖ ప్రకటనలు ముందు ముందు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.

పార్లమెంటు లో ఆర్ధిక సంస్కరణల వైపు ఆర్ధిక మంత్రి ద్రుష్టి సారిస్తున్నందున , ఈ వారం పీ . ఎస్. యు. కంపనీలు, ఫైనాన్స్ కి సంబంధించిన స్టాకులు, ముఖ్యం గా ఇన్సురన్సు కి సంబంధించిన Max, Reliance Captial , ICICI ,FCH వంటి స్టాకు ల లో కొంత చలనం కనిపించే అవకాశం ఉంది.

ప్రైమరీ మార్కెట్ల లో IPO సందడి ప్రారంభ మైనందున , మదుపర్లలో కొంత ఉత్సాహం చోటు చేసుకుంది. NHPC IPO ఈ వారం ప్రారంభం కానున్నది. దీనివలన , సెకండరీ మార్కెట్ల నుండి ధనం కొంత ప్రైమరీ మార్కెట్ల నకు బదిలీ కానున్నది. ఐతే విదేశీ సంస్థాగత మదుపర్లు ఈ వారం మన మార్కెట్ల కి చేయూత నిచ్చే అవకాశం ఉంది. గత వారం కూడా విదేశీ మదుపర్లు భారిగా కొనుగోళ్ళు సాగించారు.

TECHNICAL గా ఈ వారం SENSEX అతి కీలక 15995 అవరోధం వద్ద ట్రేడ్ కా నున్నది. 15814 పాయింట్ల వద్ద గట్టి అవరోధం ఉంది. ఈ అవరోధాన్ని చేదించే ప్రయత్నం లో మార్కెట్లు గత రెండు వారాలు CONSOLIDATE అయినందున , ఈ వారం మార్కెట్లు ఈ అవరోధం దాటి సుమారు 16262 పాయింట్ల వరకు ఎగబాకే ప్రయత్నం చేయవచ్చు. ఐతే దీనికి ప్రపంచ మార్కెట్ల సానుకూల వాతావరణం అతి ముఖ్యం . ఈ వారం సెన్సెక్స్ నకు 15814- 15995-16262-16502 పాయింట్లు గట్టి అవరోధాలు. కాగా 15568-15370-15169-15080 పాయింట్లు ముఖ్య మద్దత్తు స్థాయిలు.

  • .