• మార్కెట్ సమీక్ష

(27-07-2009 నుండి 31-07-2009 వరకు )

మా అంచనాలకు అనుగుణం గా ఈ వారం మార్కెట్లు consolidate అయ్యాయి. ఈ వారం సెన్సెక్స్ 13 నెలల గరిష్ఠ స్థాయి వద్ద , అంటే 15670 పాయింట్ల వద్ద, 1.9 % వృద్ధిని నమోదు చేస్తూ ముగిసింది. అలాగే, 2009 అత్యధిక మార్కును నిఫ్టీ దాటింది.నిఫ్టీ 4636 పాయింట్ల 1.5 % వృద్ధి తో వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో మార్కెట్లు 60 శాతం లాభపడ్డాయి.ఒక్క జూలై నెలలోనే మార్కెట్లు 8 శాతం లాభపడటం విశేషం . ఈ వారం మార్కెట్ల లో ప్రారంభం లో కొంత క్షీణించినా , వారం చివర్లో మరల పుంజుకొని లాభాల లో ముగిసింది.ఈ వారం లో చైనా మార్కెట్లు మన మార్కేట్లని ప్రాభావితం చేయటం, ట్రేడింగ్ టర్న్ ఓవర్ లో బుధవారం మార్కెట్లు రికార్డు ను సృష్టించటం , కంపనీలు అధ్బుత ఫలితాలు ప్రకటించటం , నిన్న ఆర్ధిక మంత్రి పార్లమెంటు లో LIC పునవ్యవస్తీకరణ బిల్లు ని ప్రవేశ పెట్టటం , RIL -RNRL వివాదం ముదిరి పాకాన పడటం - ముఖ్య హైలైట్స్ .

ఈ వారం రోజువారి గా మార్కెట్ల ప్రస్థానం ఈ విధం గా ఉండింది.

  • సోమవారం

లాభాలను సొమ్ము చేసుకునే నేపధ్యం లో నేడు మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి. నేడు సెన్సెక్స్ స్వల్పం గా 4పాయింట్లు క్షీణించి 15375 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 4 పాయింట్లు లాభం పడి 4572 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలను నమోదు చేస్తూ ముగిసింది. రిలయన్స్ ఫలితాలు మార్కెట్ల ని నిరాశ పరచటం తో , మన మార్కెట్ల లో సెంటిమెంట్ బలహీనం గా ఉండటం తో మార్కెట్లు క్షీణించాయి. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.63 % , స్మాల్ క్యాప్ రంగం 1.53 % లాభం పడటం విశేషం.

  • మంగళ వారం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లపై సమీక్ష జరిపింది. ఆర్‌బీఐ కీలకరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 43 పాయింట్లు కోల్పోయి 15,332 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 4,564 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో మిడ్క్యాప్ రంగం 1.1 % , స్మాల్ క్యాప్ రంగం 1.7 % వృద్ధి చెందాయి.

  • బుధ వారం

నేటి ట్రేడింగ్ లో టర్న్ ఓవర్ భారి స్థాయి లో జరగటం విశేషం. నేడు చరిత్ర లో టర్న్ ఓవర్ స్థాయి లో మూడవ స్థానం దక్కించుకుంది. నేడు 1.47 trillion మేరకు అమ్మకాలు జరిగాయి. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ 0.98 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 1,46 శాతం క్షీణించింది. నేడు సెన్సెక్స్ సుమారు 158 పాయింట్లు కోల్పోయి 15173 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 4513.5 పాయింట్ల వద్ద ముగిసింది.

  • గురువారం

F & O ముగింపు తో నేడు , ఈ వారం లో మొదటి సారిగా , మన మార్కెట్లు లాభాల తో ముగిసాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 214.50 పాయింట్లు పుంజుకుని 15,388 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 58 పాయింట్లు లాభపడి 4,571 వద్ద ముగిసింది.చైనా మార్కెట్ల ప్రభావంతో ఆసియా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. నష్టాల ప్రక్రియలో సెన్సెక్స్ 15,065 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది. ఐతే చైనా సెంట్రల్ బ్యాంక్ , ద్రవ్య విధానం లో వెసులు బాటు కల్పించనున్నదని హామీ ఇవ్వటం తో , చైనా మార్కెట్లు, తద్వారా ఆసియా మార్కెట్లు లాభ పడ్డాయి. నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల అయ్యాయి. జూలై 18 తాలూకు ద్రవ్యోల్బణం గణాంకాలు 1.54% ప్రతివృద్ధిని సాధించాయి. గత వారం ఇది - 1.17% గా నమోదు అయ్యింది. బీఎస్ఈ మధ్యతరహా 29 (0.54 % )పాయింట్లు, చిన్నతరహా కంపెనీల ఇండెక్స్‌లు 49 ( 0.80 % ) పాయింట్లు చొప్పున వృద్ధి చెందాయి.

  • శుక్ర వారం :

లోక్ సభ లో ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖేర్జీ ఇన్సురన్సు రంగం లో ఆర్ధిక సంస్కరణలను చేపట్టే దిశ లో ప్రథమంగా LIC బిల్లు ని ప్రవేశ పెట్టటం తో నేడు మన మార్కెట్లు భారి గా లాభ పడ్డాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 282 పాయింట్లు పుంజుకుని 15,670 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 4,636 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.83 శాతం, నిఫ్టీ 1.42 శాతం మేరకు వృద్ధి చెందాయి.నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.17 % లాభ పడగా , స్మాల్ క్యాప్ మాత్రం కేవలం 0.03 % లాభాలాను నమోదు చేసింది.

ఈ వారానికి FMCG 6.1 % , ఐ.టి ఇండెక్స్ 4.8 %, అత్యధికంగా వృద్ధిని నమోదు చేసాయి. కాగా ఆయిల్ మరియు గ్యాస్, హెల్త్ కైర్ ఇండెక్స్ లు 1.6 %, 1.2 % చొప్పున క్షీణించాయి.

స్టాకులు వారిగా , ఈ వారం లో TCS 9.72 %, TATA POWER 9.64 %, HPCL -9.11 %, ACL -7.93 %, BPCL -7.26 % , WIPRO 5.44 %, TATA MOTORS 5.6 %, DABUR 5.12 % విశేషం గా లాభాలను ఆర్జించ గా , SUN PHARMA -8.69 %, ABB -7.83 %, HERO HONDA- 6.306 %, RPL - 5.97 5, RIL - 5.96 %, GAIL - 5.35 %, ZEE ENTERTAINMENT - 4.72 % అత్యధికం గా నష్టాలను చవిచూసాయి.

  • .