• మార్కెట్ ముందు చూపు
(24-08-2009 నుండి 28-08-2009 వరకు )
గత వారం బలహీనం గా ప్రారంభ మైన మార్కెట్లు , చివరికి సానుకూల ప్రపంచ వాతావరణం నడుమ లాభాల్లో ముగిసింది. గత ఆదివారం మేము చర్చించినట్లు , 14780 పాయింట్ల మద్దత్తు స్థాయి అతి కీలక పాత్ర పోషించి సెన్సెక్స్ ని భారి నష్టల్లోంచి కాపాడింది.
ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను పరిశీలిస్తే, గత శుక్రవారం అమెరికా మార్కెట్లు గరిష్ట స్థాయి లో ముగియటం వలన ఈ వారం ప్రారంభం మార్కెట్లు ఉత్సాహం గా చేయనున్నాయి. రుతుపవానాలు కొంత వరకు పురోగామించినందున ఈ వారం వర్షాభావ పరిస్థితిలు ప్రతికూలం గా మాత్రం ప్రభావితం చేయబోవు. ఈ అంశం కూడా బుల్ల్స్ కి మద్దత్తు ఇవ్వనున్నది.
ఈ గురువారం F & O ముగింపు కనుక ఈ వారం మధ్య లో మార్కెట్ల లో కొంత షార్ట్ కవేరంగ్ చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ కారణం గా ప్రపంచ మార్కెట్ల ప్రభావానికి అతీతం గా , ఈ వారం మధ్య లో మన మార్కెట్లు వ్యవహరించ నున్నాయి.
RIL- RNRL వివాదం, స్వయిన్ ఫ్లూ అంశాలు కూడా మార్కెట్లను కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంది.
టెక్నికల్ గా పరిశీలిస్తే, గత వారం చార్టు ల లో HEAD - SHOULDERS PATTERN ( BEARISH TREND) కనిపించినప్పటికీ, ఈ వారం F & O ముగింపు కారణం గా కొంత మేరకు షార్ట్ కవేరింగ్ జరిగే అవకాశం ఉన్నందున, ఈ వారం కూడా గత నాలుగు వారాలు మనం గమనించిన విధం గా CONSOLIDATE అయ్యే అవకాశం ఉంది. షార్ట్ కవేరింగ్ భారి గా జరిగితే మార్కెట్లు అతి కీలక 16002 పాయింట్ల అవరోధం చేదించే అవకాశం కూడా లేకపోలేదు.అప్పుడు సెన్సెక్స్ స్వల్పకాలనికి గాను సుమారు 16111 పాయింట్ల వరకు ఎగబాకే అవకాశం ఉంది. ఐతే ఈ ప్రస్థానం లో 15568, 15995 పాయింట్లు సెన్సెక్స్ కి అవరోధం కలిగించ నున్నాయి. ఆ తరువాత 16002-16111-16452 అవరోధాలు సెన్సెక్స్ నకు ముఖ్యమైనవి .
గత వారం సూచించిన విధం గా, ఈ సారి కూడా 14780 పాయింట్ల మద్దత్తు స్థాయి మరొక సారి కీలక పాత్ర వహించ నున్నది. 15169-15080-14930- 14780 -14530 మద్దత్తు స్థాయిలు.