21-08-2009 :: 6 :30 PM

మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్ వారాంతంలో లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 229 పాయింట్లు పుంజుకుని 15,241 వద్ద నిలచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 4,529 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.52 శాతం, నిఫ్టీ 1.69 శాతం మేరకు వృద్ధి చెందాయి.

ఈ రోజు ఉదయం 60 పాయింట్ల నష్టంతో 14,951 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది.

మేము ఉదయం చర్చించినట్లు , ఆసియా మార్కెట్ల నుంచి వీచిన బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ నష్టాల తో ప్రారంభమయ్యింది.

దీనికి తోడు హంగ్ కాంగ్ మార్కెట్ల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్‌పై పడింది. దీంతో ప్రథమార్ధంలో ఇండెక్స్ నష్టాల ప్రక్రియలో 14,835 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది. అయితే ,అధ్యాన్నతరం ఐరోపా మార్కెట్లు పుంజుకోవడంతో మన స్టాక్ మార్కెట్లు కూడా లాభాల బాటను పట్టాయి.

పుంజుకుంటున్న ఋతుపవనాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల లో భారత్ , శ్రీ లంక దేశాల పై పెరుగుతున్న ఆసక్తి మన మార్కెట్ల సెంటిమెంట్ ని కొంత బలపరిచాయి. దీనితో బుల్ల్స్ మరొక సారి తమ సత్తా చాటాయి . ఇలా లాభాల ప్రక్రియలో సెన్సెక్స్ 440 పాయింట్లు పుంజుకుని గరిష్ఠంగా 15,275 వద్దకు చేరుకుంది.చివరికి 229 పాయింట్ల లాభంతో ముగిసింది. అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాల్లో నడిచాయి. బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ 3.48 శాతం మేరకు అత్యధికంగా లాభపడింది . కాగా ఆటో ఇండెక్స్ 2.28 % వృద్ధిని నమోదు చేసింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ఇండెక్స్ సెన్సెక్స్ కి సరిసమానం గా 1.5 శాతం లాభ పడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.6 % లాభ పడింది.

నేటి సెన్సెక్స్ స్టాకు ల లో హీరో హోండా 4.6 %,ICICI బ్యాంకు 3.6 % వృద్ధిని సాధించాయి. కాగా HDFC బ్యాంకు, సన్ ఫార్మ 1 %, 0.3% చొప్పున క్షీణించాయి.