24-08-2009.

మార్కెట్ నాడి ::8:00 am

లాభాల తో గత శుక్రవారం ముగిసిన మన మార్కెట్లు నేడు మరొక సారి ఉత్సాహం గా ట్రేడింగ్ ప్రారంభించనున్నాయి. . గత శుక్రవారం అమెరికా మార్కెట్లు సైతం గరిష్ట స్థాయి లో ముగియటం మన మార్కెట్ల లోను బుల్ల్స్ కి ఉత్సాహం కలిగించే అంశం. ఆసియా మార్కెట్లు నేడు లాభాల బాట లో నడవటం మన మార్కెట్లకి మరింత చేయూత నివ్వనున్నాయి. అంతే కాక ,దేశం లో ఋతుపవనాలు కోలుకోవటం కూడా మన మార్కెట్ల కి తాత్కాలికం గా , మరి కొంత ఆశలు కలిగించ నున్నాయి. ఈ అంశాలను పరిశీలిస్తే నేడు మార్కెట్లు శుభారంభం చేయనున్నాయని చెప్పవచ్చు.

ఐతే గత వారం చైనా మార్కెట్ల నుండి విదేశీ సంస్థాగత మదుపర్లు భారి స్థాయి లో పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. మన మార్కెట్ల పరం గా యోచన చేస్తే, , మన మార్కెట్ల లో కూడా FII ల లావా దేవిలు తగ్గుముఖం పట్టాయి. పైగా విదేశీ కరెన్సీ మార్కెట్ల లో రూపాయి విలువ క్షీనిస్తోంది. రూపాయి ఫ్యూచర్ కాంట్రాక్టు లను గమనిస్తే , మునుముందు , రూపాయి మరింతగా క్షీణించే అవకాశం ఉంది. దీనిని అనుసరించి FII లు మన మార్కెట్ల నుండి కూడా పెట్టుపడులను ఉపసంహరించే అవకాశం లేకపోలేదు. ఈ అంశం రానున్న రోజులలో భల్లూకాలకి ( bears ) ఆశలు రేకిత్తే విషయం .

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15241
  • అవరోధాలు: 15370-15446 -15568
  • మద్దత్తులు ::15169-15080-14930-14888