• 31-08-2009 :: 8:30 am
  • మార్కెట్ నాడి
వారాంతం తరువాత నేడు మార్కెట్లు మరొక సారి ట్రేడ్ కానున్నాయి. నేడు ఆసియా మార్కెట్లు లాభాల తో ప్రారంభం చేసినా, క్రమంగా నష్టాలలో కూరుకుపోవటం , గత వారం రోజులు గా మన మార్కెట్ల లో కొనసాగుతున్న బుల్ల్స్ పెత్తనానినికి నేడు బ్రేక్ పడే అవకాశం ఉంది.
ఐతే నేడు జూన్ తో ముగిసిన త్రైమాసిక GDP వృద్ధి రేటు ఉదయం 11 గంటలకు విడుదలకానున్నది. దీని ప్రభావం కూడా మార్కెట్ల పై పడవచ్చు . ఈ సారి GDP వృద్ధి రేటు సుమారు 6.2% గా ఉండగలదని ఆంచనా . గతం లో ఈ రేటు 5.8% గా ఉన్నదని మీకు తెలుసు. మార్కెట్ అంచనాలకి అనుగుణం గా వృద్ధి రేటు నమోదు అయితే , మార్కెట్లు నేడు మరింత గా లాభపడే అవకాశం ఉంది. విదేశీ సంస్థాగత మదుపర్లు మన మార్కెట్ల పై ప్రత్యెక దృష్టి సారించటం కూడా నేడు మన మార్కెట్లకు తోడ్పడే అంశం.
టెక్నికల్ గా పరిశీలిస్తే , సెన్సెక్స్ 15900~16000 పాయింట్ల మధ్య బలీయమైన అవరోధం ఉంది. 16002 పాయింట్ల అవరోధం అతి కీలకం . ఈ అవరోధం చెదించ గలిగితేనే మార్కెట్లు మరింత గా పుంజుకునే అవకాశం ఉంది. సానుకూల GDP గణాంకాల వలన నేడు ఈ అవరోధం చేదిస్తే , మార్కెట్ల లో బుల్ల్స్ జోరు కొనసాగే ఆవకాశం ఉంది.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15922
  • అవరోధాలు : 15995 -16002-16111
  • మద్దత్తులు:15916-15814-15769